| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం

రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం

డైలీ భారత్, గుంటూరు:రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం చేసిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ రోమాలు నిక్కబొడిచే దారుణమైన ఘటన గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న  రైల్లో చోటుచేసుకుంది. ప్రయాణం మధ్యలో గుర్తు తెలియని దుండగుడు మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటన సమయంలో రైలు ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణిస్తోంది. బాధితురాలి హ్యాండ్‌బ్యాగ్‌ను దోచుకున్న దుండగుడు, వెంటనే స్టేషన్ వద్ద దిగిపోయి పరారయ్యాడు.

షాక్‌కు గురైన మహిళ చర్లపల్లికి చేరుకున్న వెంటనే జీఆర్పీ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ప్రమాదకర పరిస్థితుల్లో రైలులో జరిగిన ఈ దారుణం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. రైల్లో సెక్యూరిటీ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. రైల్వే పోలీసులు నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Previous తుపాకీతో కాల్చుకుని ASI ఆత్మహత్య..
Next కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై యువకుడి ఆత్మహత్య
ADVERTISEMENT