| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

ఈవీఎం గోదాములను పరిశీలించిన  కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

డైలీ భారత్, వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్  లో  జిల్లా  గోదాములను  జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం పరిశీలించారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు  ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా  ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు లోని జిల్లా ఈవీఎం గోదాములను  కలెక్టర్  తనిఖీ చేసి,ఈవీఎంలు భద్రపరిచిన  స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ తనిఖీలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్,  తదితరులు పాల్గొన్నారు.

Previous 60 లక్షల విలువైన గంజాయి సీజ్ చేసిన కోదాడ పట్టణ, CCS పోలీసులు
Next నగరంలో అర్ధరాత్రి వేళ పలు ప్రాంతాల్లో సిపి తనిఖీలు
ADVERTISEMENT