| Daily భారత్
Logo




60 లక్షల విలువైన గంజాయి సీజ్ చేసిన కోదాడ పట్టణ, CCS పోలీసులు

News

Posted on 2025-10-07 12:56:57

Share: Share


60 లక్షల విలువైన గంజాయి సీజ్ చేసిన కోదాడ పట్టణ, CCS పోలీసులు

60 లక్షల విలువైన 1 క్వింటా 20 కేజీల గంజాయి సీజ్ చేసిన కోదాడ పట్టణ, CCS పోలీసులు 

- ముగ్గురు అంతరాష్ట్ర నింధితుల అరెస్ట్.

- గంజాయి రవాణా, సరఫరా, అమ్మకం, వినియోగం నేరం.

- NDPS చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవు.

ఎస్పి నరసింహ ఐపిఎస్, సూర్యాపేట జిల్లా.

జిల్లా పోలీసు కార్యలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలు, అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐ‌పి‌ఎస్

డైలీ భారత్, సూర్యాపేట: జిల్లాలో గంజాయి రవాణా సరఫరా వినియోగము అమ్మకాలపై జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన నిఘ ఉంచి దీని నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తున్నాము. జిల్లాలో విస్తృతమైన పోలీసు తనిఖీలు నిర్వహిస్తున్నాం. గత నెల 23వ తేదీన కోదాడ పట్టణ పరిధి జాతీయ రహదారి వెంబడి సుమారు 110 కేజీల గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు దీనిని గుర్తించిన కోదాడ పట్టణ పోలీసులు స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. ఈ దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించడం కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగినది, సాంకేతిక ఆధారాలు, CC ఫుటేజ్, నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం రోజున కోదాడ పట్టణ పోలీసులు పట్టణ పరిధి జాతీయ రహదారిపై కట్టకొమ్ముగూడెం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసును గమనించి అనుమానాస్పదంగా పారిపోతున్న కారును వెంబడించి పట్టుబడి చేయడం జరిగినది. ఇందులో A 1 కణం రమేష్ ఉండగా అతని వద్ద 10 కేజీల గంజాయిని స్వాధీనపర్చుకోవడం జరిగినది, A2 నిందితుడు చాపల అశోక్, A3 చాపల ఎరకమ్మ లను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేయగా గత నెలలో కోదాడ పట్టణ పరిధిలో 110 kg ల గంజాయిని వదిలేసి వెళ్లినట్లు ఒప్పుకున్నారు. జిల్లా పోలీసులు విసృత తనిఖీలు చేస్తున్నందున దొరుకుతామనే భయంతో పడివేసి పారిపోయినట్లు ఒప్పుకున్నారు.

హైద్రాబాద్ కు చెందిన నేరస్తుడు A-1 నింధితుడు కణం రమేష్  నిత్య అన్నదానములు కలిగిన ఆశ్రమాలకు బియ్యం సప్లై చేసుకుంటూ వ్యాపారం చేసేవాడు, సరైన ఆదాయం పొందలేక మిల్లర్లకు డబ్బు చెల్లించలేదు, వ్యాపారం బాగాలేదు మానసిక ప్రశాంతత కొరకు కుటుంబం నుండి దూరంగా ఉండి ఓంశాంతి బ్రహ్మ కుమారి ఆశ్రమంలో తిరుగుతుండగా తనకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన A-3 ఎరకమ్మ అనే ఆవిడ పరిచయం అయి ఇద్దరు కలిసి గత రెండు సం,,ల నుండి కలిసి విజయవాడలో ఉంటూ మరల బియ్యం వ్యాపారం చేయగా వ్యాపారంలో మళ్ళీ నష్టం రావడంతో, ఎలాగైనా అధిక డబ్బులు సంపాదించాలంటే గంజాయి వ్యాపారం చేస్తే తన అప్పులు తీరుతాయని A-3 /ఎరకమ్మ కు చెప్పగా తను సరే అని ఇరువురు కలిసి అధిక డబ్బులు సంపాదించవచ్చని పథకం వేసుకొని A-3, A-2/అశోక్ ను విజయవాడ కు పిలిపించి A-2 ద్వార గంజాయిని ఒడిశా నుండి విజయవాడకు తెప్పించి హైదరాబాద్ లో కావలిసిన వారికి అమ్ముదాము అనే ఉద్దేశ్యంతో A-1 డబ్బులు A-2 కి ఇవ్వగా A-2/అశోక్  ఒడిశా కు వెళ్ళి కేజీ 5,000/- ల చొప్పున 110 KG ల గంజాయిని కొనుగోలు చేసి బస్తాలలో ప్యాక్ చేసుకొని తేదీ 22.09.2025 రోజు రాత్రి A-2 విజయవాడలోని A-3 రూoకు తీసుకొని రాగా A-1/రమేష్ అట్టి గంజాయిని విజయవాడలో తన యొక్క Tata Zest కారు నంబర్ TS 08 FR 6521కారులో లోడ్ చేసుకొని తేదీ 23.09.2025 రోజు తెల్లవారుజామున విజయవాడ నుండి హైదారాబాద్ కు వెళుతుండగా మార్గమధ్యలో కోదాడ పట్టణ శివారులో రోడ్డు పై పోలీస్ వారు వాహనాలు తనిఖి చేస్తుండగా మరల విజయవాడ వైపుకు కొద్ది దూరం వచ్చి అక్కడ ఒక స్థలం చూసుకొని హైదరాబాద్ వైపు కు సర్విస్ రోడ్ ప్రక్కనే భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కనే ఉన్న ఒక షెడ్ లోపలికి వెళ్ళి వద్ద ఉన్న 110 KG ల గంజాయిని పడవేసి ఎరకమ్మకు ఫోన్ ద్వారా చెప్పగా అక్కడ నుండి పారిపోయి రమ్మనగా A-1 విజయవాడకు వచ్చినాడు. వారి పథకం విఫలం కావటంతో కొన్ని రోజులు వేచి చూసి తేదీ 05.10.2025 రోజు రాత్రి A-2 మరల 10 KG గంజాయి ఒడిశా నుండి తీసుకు రాగా A-1 తేదీ 06.10.2025 రోజు ఉదయం 10.00 గంటలకు అట్టి గంజాయిని తన కారులో వేసుకొని అమ్ముటకు విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళుతుండగా మార్గ మధ్యలో కోదాడ పట్టణ శివారు లోని కట్టకొమ్ముగూడెం X రోడ్ దగ్గర పోలీస్ వారు వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసు వారిని చూసి కారును వేగంగా  నడపగా  పోలీసు వారు వెంబడించి పట్టుకొని అతని వద్ద ఉన్న 10 కేజీలు గంజాయిని మరియు 6 సెల్ ఫోన్లు ఒక కారు,స్వాదీనపరుచుకొని,A-1 యొక్క ఒప్పుకోలు తర్వాత విజయవాడలో A-2,A-3 లను పట్టుబడి చేసి  వారి వద్ద  రెండు ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  సదరు నిందితులను న్యాయస్థానంనందు పరుస్తాము అని తెలిపారు.

నిందితుల వివరాలు:

A-1.కణం రమేష్, వయస్సు 52 సం,,లు, వృత్తి: వ్యాపారం, నివాసం: ప్లాట్ నెంబర్ 49, AS రావు నగర్, ECIL పోస్ట్,తెలంగాణ రాష్ర్టం.

A-2.చాపల అశోక్, వయస్సు: 33 సం,, లు, వృతి: ప్రైవేట్ టీచర్,R/oసిత్తు సీతారామ పురం గ్రామం రామ బద్ర పురం మండలం, విజయనగరం జిల్లా,A.P

A-3.చాపల ఎరకమ్మ@ రోహిణి, వయస్సు: 37 సం,, లు, వృతి: ప్రైవేట్ లెక్చరర్,R/oసిత్తు సీతారామ పురం గ్రామం రామ బద్ర పురం మండలం, విజయనగరం జిల్లా,A.P

పట్టుబడి చేసిన స్థలం మరియు తేదీ:

తేదీ:06.10.2025,న్యూ విజన్ స్కూల్ వద్ద NH-65 రోడ్డు పై.

స్వాదీనం చేసుకున్నవివరములు:

120 కేజీల గంజాయి(రెండు కేసులలో కలిపి ) (గంజాయి విలువ Rs. 60,00,000)

కార్ నెం: TS08 FR6521

8 సెల్ ఫోన్ లు 

ఇట్టి కేసు త్వరితగతంగా ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివ శంకర్,CCS SI హరిక్రిష్ణ, కోదాడపట్టణ SI హనుమనాయక్, హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీనివాస్, కానిస్టేబుల్ యన్.యల్లారెడ్డి, జి.సతీష్, యం.వెంకటేశ్వరులు, కె.రాంబాబు, ఎస్‌కే. ఫరీద్ సిబ్బంది మరియు It core స్టాఫ్ ను సూర్యాపేట జిల్లా SP K. నర్సింహా IPS రివార్డ్ తో అభినందించారు.

Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >