| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో ఎండు గంజాయి పట్టివేత

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో ఎండు గంజాయి పట్టివేత

అరెస్టు చేసిన వారిలో ఒకరు మైనర్ కాగా మిగతా ఇద్దరు మేజర్లు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సభ్యులు సోమవారం నగరంలో అక్రమంగా ఎండు గంజాయి విక్రయిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు నగరంలో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు  తనిఖీలు నిర్వహించగా 7.700 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. అందులో ఓ మైనర్ బాలుడితో పాటు సిరికొండకు చెందిన వంశీ, తరుణ్ లను అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. అయితే నిషేధిత అక్రమ ఎండు గంజాయి తరలింపులో పోలీస్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా ఇతర రాష్ట్రాల నుండి గంజాయి తరలింపులో మైనర్లను బలి పశువులుగా గంజాయి ముఠా సభ్యులు కొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టారనే విషయం ఈ  తనిఖీల్లో తేతటేల్లమైందని అధికారులు పేర్కొన్నారు. ఈ సోదాలో ఎస్సై బి.రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Previous దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు, 5000 రూపాయల జరిమానా
Next విష్ణుమూర్తి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ గిరిబాబు సంతాపం
ADVERTISEMENT