| Daily భారత్
Logo




కొత్త టెండర్ వేయించి, డివైడర్ పార్కులలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు పని కల్పించాలి

News

Posted on 2024-01-02 12:12:43

Share: Share


కొత్త టెండర్ వేయించి, డివైడర్ పార్కులలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు పని కల్పించాలి

కార్మికులకు రావలసిన బకాయి వేతనాలు వెంటనే అందించాలి

డైలీ భారత్, సిరిసిల్ల : ఈరోజు డివైడర్ పార్కులో పనిచేసే కార్మికులకు వెంటనే పని కల్పించాలని వారికి రావలసిన 5 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణంలో గల పార్కులు డివైడర్లలో శానిటేషన్ పనిచేస్తున్న 50 మంది కార్మికులు పార్కులు డివైడర్లు పనిచేసే కాంట్రాక్టు తీసుకున్న వారి కాంట్రాక్టు  గత నెల డిసెంబర్ 11 వరకు అయిపోవడం జరిగిందని తర్వాత మళ్లీ టెండర్ మున్సిపల్ అధికారులు వెయ్యకపోవడం వలన కాంట్రాక్టర్ కార్మికులను పనిచేయవద్దని చెప్పడం జరిగిందన్నారు దానితో 15 రోజుల నుండి కార్మికులు పని లేకుండా ఉంటున్నారని దానికి తోడు వారికి రావలసినటువంటి ఐదు నెలల వేతనాలు రాకపోవడం వలన ఒకపక్క పని లేక మరోపక్క చేసిన పనికి వేతనం రాకా  కార్మికులు వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొన్నదని ఇప్పటికే ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిన కూడా సమస్య పరిష్కారం చేయడం లేదన్నారు వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మళ్లీ డివైడర్లు పార్కులకు కొత్త టెండర్లు వేయించి కార్మికులకు ఉపాధి కల్పించాలని అదేవిధంగా బకాయి వేతనాలను ఇప్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నర్సయ్య , శారద , రమణమ్మ , గీత , వసంత , మణెమ్మ , లక్ష్మి , శ్రీకాంత్ ,  రాకేష్ , వంశీ , కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >