Posted on 2024-01-02 09:08:15
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ను ఈరోజు స్థానిక 34 వార్డ్ లో ప్రారంభించిన NAFSCOB చైర్మన్ కొండూరి రవీందర్ రావు మరియు వార్డ్ కౌన్సిలర్ సభ్యులు దార్ల కీర్తన సందీప్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం 06-01-2024 వరకు నిర్వహించడం జరుగుతుందని కావున ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గడువు లోపు దరఖాస్తులు సమర్పించలేని వారు ఉంటే పురపాలక సంఘ కార్యాలయంలో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు ..
పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాలు మరియు ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టో పథకాలు అన్ని అందేలా చర్యలు చేపట్టాలని ఈ సభా వేదిక నుండి ప్రభుత్వంను కోరారు.
ప్రజలకు దరఖాస్తుల విషయంలో ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి గాని అధికారుల దృష్టికి గాని తీసుకరావాలని తెలిపారు.
అభయహస్తం దరఖాస్తు ఫారం లో లేని సమస్యల పట్ల అనగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు వంటి ఇతర ప్రభుత్వ సహాయ సహకారాల గురించి మరియు ఫిర్యాదుల గురించి అయినా తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి ప్రజా పాలన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో దరఖాస్తు ఇవ్వాల్సిందిగా ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహాత్ బేగ్ ఆలీ, DE ప్రసాద్ ఇతర అధికారులు, ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు,వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >