Posted on 2025-09-27 08:20:51
జనసేన శ్రేణులకు కీలక ఆదేశాలు
డైలీ భారత్, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా హైదరాబాద్ మహానగరం తడిసిముద్దైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాల నుంచి వరద నీరు విడుదల చేయడవంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఈ పరిణామంతో పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వదర నీరు వచ్చి చేరింది.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు, తెలంగాణ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలని సూచించారు. వరద బాధితులకు మనోధైర్యం కల్పించి వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని, మూసీ వరదతో MGBS పరిసరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
#mgbs #pawan Kalyan #musi #hyderabad
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >