| Daily భారత్
Logo




ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

News

Posted on 2025-09-25 10:15:20

Share: Share


ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలి : కలెక్టర్  సందీప్ కుమార్ ఝా

చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ పరిశీలన

డైలీ భారత్, చందుర్తి: స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ కింద జిల్లాలోని ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

ఈ నెల 17 వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు కొనసాగనున్న స్వస్థ్ నారి, సాశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో గురువారం మహిళలకు వైద్య శిబిరం నిర్వహించగా, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళలకు వివిధ పరీక్షలు వైద్యులు, సిబ్బంది చేస్తుండగా ఆరా తీశారు.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ...

ప్రతి రోజూ ప్రత్యేక వైద్య నిపుణులు ఆసుపత్రుల్లో అన్ని ఆరోగ్య పరీక్షలు చేస్తారని తెలిపారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత డయాబెటిస్, రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు సలహాలు అందించాలని సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబము అనే కార్యక్రమం కింద   ప్రత్యేక వైద్య నిపుణులతో కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు, రక్తపోటు, డయాబెటిస్, దంత పరీక్షలు, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, టీబీ పరీక్షలు చేస్తారని, సికిల్ సెల్ ఎనీమియా, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి కొరకు వంట నూనెలను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడం, రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం గురించి మహిళలకు అవగాహన కల్పిస్తారని వివరించారు.

రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి కావలసిన మందులు, పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని ఆదేశించారు. మహిళలు శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

శిబిరంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >