| Daily భారత్
Logo




శీర్షిక : కార్మికుల కష్టాలు

News

Posted on 2025-09-24 08:55:21

Share: Share


శీర్షిక : కార్మికుల కష్టాలు

డైలీ భారత్, స్పెషల్ శీర్షిక:

శీర్షిక : కార్మికుల కష్టాలు

భారీ తుపాను వల్ల వలలు విసరులు లేక  

ఒడ్డున పడ్డ చేపల లాగ గిలగిల కోట్టుకుంటున్న  మత్స్య కార్మికులు ఎందరో

కడలి ఆటుపోటలను తట్టుకుంటూ ఆకలి కేకలను

కడుపులో దాచుకొని చేపాలను పట్టుకున్న కూడ

దళారులు చెప్పిన రేటుకే అమ్ముకొంటున్న

గంగపుత్రులు ఎందరో

కాలాలు మారిన తరతరాలుగా

నీటిలోపల బతికే చేపలపై

జీవనాధారం సాగిస్తూ చాలిచాలని

కూలీ డబ్బులతో బత్రుకుతున్న

మత్స్య కార్మికుల చిరునవ్వు వెనుక

బాధలు గమనించారా

మేస్త్రి ఇచ్చిన తక్కువ కూలి డబ్బులు

తీసుకుంటూ ఇచ్చినప్పుడే తీసుకుంటూ బతుకుబండి లాగుతున్నా దినసరికూలిల చిరునవ్వు వెనుక బాధలు గమనించారా

సముదప్రు నీటిలో ఉప్పెనలా

పోంగిన అలలను దాటుకుంటూ

ఎండిన డొక్కలతో

పడువ పై బత్రుకుబండి సాగిస్తూ

మదివిప్పి చెప్పలేని మౌన ఘోషను

అర్దం చేసుకున్నారా

భారీ వర్షాల వల్ల రెక్కాడితే కానీ డొక్కాడని

దినసరి కూలీల మనోవేదనను అర్దం చేసుకున్నారా

వర్షంలో తడిసి కలిసిపోయిన దినసరి కూలిల కన్నీళ్లు చెక్కిళ్ళను చూసారా ఎవరైనా 

రోగం వచ్చిన నొప్పి వచ్చిన కుటుంబ

 ఆకలి కేకలు చల్లార్చడానికి పనికి పోతున్న దినసరికూలి అన్నను చూసారా ఎవరైనా

ప్రభుత్వం నిత్యావసరాలను జాలరులకు

దినసరికూలిలకు అందించాలి అని  వేడుకుంటు 

బతుకు రేవుల నావలలో తెరచాపలను 

తిరిగి రెపరెప లాడించే రోజురావాలని

దినసరికూలిలకు మంచి రోజులు  రావాలని కోరుకుంటూ 


మీ

శ్రీమతి మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

 చరవాణి 9347042218

Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >