Posted on 2025-09-12 10:08:07
తెలంగాణను రోల్ మోడల్ గా తీర్చిదిద్దటం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..
రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడి..
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జనాభా ప్రతిపాదన ప్రకారం ఎవరికి దక్కాల్సిన రిజర్వేషన్లు వారికి అందుతేనే సమాజంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం దక్కుతుందనేదే రాహుల్ గాంధీ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాహుల్ గాంధీ ప్రణాళిక పరంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా ఈనెల 15 న కామారెడ్డి లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అందుకుగాను భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు. ఈ సభ ద్వారా భవిష్యత్ లో రాష్ట్రంలో చేపట్టబోయే మరిన్ని సంక్షేమ పథకాల ప్రకటన ముఖ్యమంత్రి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎరువులు కొరతకు కేంద్రం కారణం..రాష్ట్రానికి తక్కువ స్టాక్ ఇవ్వటం వల్ల రైతులకు నేడుఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రిజర్వేషన్ లపై రాష్ట్రాలకే అవకాశం ఇవ్వండి అని కేంద్రాన్ని కోరుతున్న పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున 42 శాతం బిసి రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత కేంద్రానిదే నని ఆయన అన్నారు.
రిజర్వేషన్ లు కొలిక్కి వచ్చాకే స్థానిక సంస్థలకు వెళ్లాలి అనుకుంటున్నాం అని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ అమిత్ రెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, నూడా చైర్మన్ కేశవేణు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నగేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >