| Daily భారత్
Logo




ఆత్మహత్యల నిరోధం కోసం వర్క్ షాప్

News

Posted on 2025-09-10 12:29:21

Share: Share


ఆత్మహత్యల నిరోధం కోసం వర్క్ షాప్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సాధారణ వైద్యశాల లోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు యువతలో ఆత్మహత్యల నిరోధం కోసం వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెంటల్ హెల్త్ కో ఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్, సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ లు హాజరై మాట్లాడినారు.

చెంజింగ్ ది నరేటివ్ ఆన్ సూసైడ్ అనే థీమ్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ప్రకటించి సమాజంలో ఆత్మహత్యల పై మాట్లాడడాన్ని, వీటి పట్ల వ్యక్తుల్లో ఉన్న కలంక భావనను, స్టిగ్మాను పోడగొట్టి, స్వేచ్చగా అందరు వీటిపై మాట్లాడడం ద్వారా ఆత్మహత్యల నివారణను ప్రోత్సహించడం కోసం అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటు చేయాలని పిలుపు నివ్వడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా యువతలో మానసిక ఒత్తిడి రోజు రోజుకు పెరిగి ఆత్మహత్యల పెరుగుతున్నాయని అన్నారు.

మానసిక ఒత్తిడి నుండి బయటపడే మార్గాలను గురించి నర్సింగ్ కళాశాల విద్యార్థులు స్కిట్ ను ప్రదర్శించినారు.

ఆత్మహత్య నివారణ పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆత్మహత్యలకు ముందుగానే వ్యక్తుల్ని కాపాడే విధానాలను గురించి వర్క్ షాప్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్ ల ద్వారా  విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ బి .ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆత్మహత్యల నివారణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు వారి సంభందీకులలో వచ్చే ప్రవర్తన మార్పులు, ఉద్వేగ మార్పులను గమనించి స్వాంతన కలిగించే మాటలతో ధైర్యం చెప్పాలని అన్నారు.

అవసరమైన సందర్భంలో సైకాలజిస్ట్ లను, సైకియాట్రిస్ట్ లను కలసి కౌన్సిలింగ్,మందులు ఇప్పించి ఆత్మహత్య ఆలోచనల నుండి బయటకు తీయాలని కోరారు.

సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ మాటడుతూ వృత్తిలో భాగంగా ప్రతి నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యల నివారణకోసం ప్రజల్లో చైతన్యం నింపేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ ను కల్గి ఉండాలని అన్నారు. 


ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సి.అనురాధ, లెక్చరర్స్ సుజాత, స్వప్న, అరుణ, అరుణ కుమారి, గ్లోరి, సంధ్యారాణి, హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అల్వాల ఈశ్వర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >