| Daily భారత్
Logo




నిజామాబాద్ కె ఎఫ్ సి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

News

Posted on 2025-09-10 11:56:46

Share: Share


నిజామాబాద్ కె ఎఫ్ సి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

కిచెన్ లో అపరిశుభ్రత దుర్వాసన వెదజల్లటంతో నిర్వహకులపై అసహనం వ్యక్తం చేసిన అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గత రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వేణు మాల్ లో కుళ్లిపోయిన చికెన్ వచ్చిందంటూ ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా కేఎఫ్లో సి తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ గెజిటెడ్ ఇన్స్పెక్టర్ సునీత, ఫుడ్ సేఫ్టీ అధికారిని నివిత, విక్రమ్ లు మున్సిపల్ అధికారులు ఎం ఎచ్ ఓ, ఇతర  అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీలలో ఊహించని విషయాలు బయటపడ్డాయని ఆమె వెల్లడించారు. కిచెన్ హాల్ బూజు పట్టి ఉండడం, అలాగే కిచెన్లో దుర్వాసన వెదజల్లటం, ఆహార పదార్థాలపై దుర్వాసన రావడంని గమనించడం జరిగిందని, దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్సి నిర్వహకులపై అసహనం వ్యక్తం చేశారు. కొన్ని అపరిశుభ్రంగా ఉన్న శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించడం జరుగుతుందని ఫుడ్ సేఫ్టీ గెజిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ సునీత వివరించారు. అలాగే కిచెన్లో అపరిశుభ్రత వాతావరణం, డ్రైనేజ్ బ్లాక్, చెడు దుర్వాసన లాంటివి విడుదల వెదజల్లుతుందని ఇందుకోసం కెఎఫ్సి నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు అలాగే కస్టమర్లకు ఇచ్చే లెగ్ పీస్ లో సగం ఉడికి ఉడికనట్టుగా ఉన్న లెగ్ పీస్ ని కూడా ల్యాబ్కు తరలించడం జరుగుతుందని 15 రోజుల్లోగా పూర్తి వివరణ కెఎఫ్సి నిర్వహకులు ఈ విషయంపై తమకు పూర్తి నివేదిక అందజేయాలని లేనియెడల తదుపరి చర్యలు తప్పవని హెచ్చరించారు.


Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >