Posted on 2025-09-09 11:57:44
తమ నాయకురాలును పార్టీ సస్పెండ్ చేయడం అన్యాయం..
బినోల సొసైటీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ లేఖను పోస్టు ద్వారా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపించారు. సందర్భంగా మగ్గరి హన్మండ్లు మాట్లాడుతూ నాయకురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధకరమన్నారు. కవితక్క కు బీఆర్ఎస్ పార్టీ లో జరిగిన అన్యాయనికి నిరసనగా తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. కవితక్క బాటలోనే తాను నడుస్తానని, ఆమె నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. తమ నాయకురాలు ఎంపీగా ఎమ్మెల్సీ గా అధికారంలో ఉన్న సమయంలో ఆమె వెంట నడిచిన మాజీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కవిత సస్పెండ్ పట్ల ముఖ్యంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలి అన్నారు. నోరు మెదపకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనం అన్నారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >