Posted on 2025-09-06 19:39:45
గోదావరి నది కరకట్ట వద్ద గణేష్ నిమజ్జోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గణేశ్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలియజేసారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలను జిల్లాఎస్పీసందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు,ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు.జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు మరియు నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని తెలిపారు.నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు,బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు.ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు.చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో,శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో భద్రాచలానికి నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడమైనదని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >