| Daily భారత్
Logo




పాలజ్ గణపతిని దర్శించుకున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-09-03 12:18:26

Share: Share


పాలజ్ గణపతిని దర్శించుకున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన పాలజ్ కర్ర గణపతిని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  దర్శించుకొని భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా సర్వజనిక్ గణేష్ మండలి ఆలయ పూజరులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతు"కర్ర గణపతి ఆలయం నేటికీ ఎన్నో తారాలుగా భక్తుల నమ్మకానికి కేంద్రబిందువుగా నిలుస్తూ ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రం భక్తుల ఆకాంక్షలను కోరికలను తీరుస్తుందని అన్నారు. పాలజ్ ప్రాంతంలో ఏడు దశబ్దాల క్రితం విషవ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మన నిర్మల్ జిల్లా కొయ్యబొమ్మల కళాకారుడుచే ఒకే చెక్కతో గణపతి తయారు చేసి పూజించడం అది దేశవ్యాప్తంగా  ప్రసిద్ధి చెందడం గర్వకారణం అన్నారు. కర్ర గణపతి ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని అన్నారు గణపతిని 11 రోజులు భక్తి శ్రద్దలతో పూజిస్తే ఎటువంటి విషవ్యాధులు దరికి చేరవణి ప్రజల విశ్వసం అన్నారు. ప్రజలు భక్తి శ్రద్దలతో కర్రగణపతిని పూజించి నిమజ్జనం చేయకుండా ఊరేగించి ఒక గదిలో భద్రపరచడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.

కర్ర గణపతి ఆశీర్వాదంతో దేశ, రాష్ట్ర ప్రజలదరు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులకు అనుకూల వర్షాలు పడి పాడి పంటలు బాగా పండాలని వేడుకున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >