Posted on 2025-09-03 09:57:52
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,పట్టణ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు
డైలీ భారత్, వైరా: ఖమ్మం జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పట్టణ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు డిమాండ్ చేశారు.వైరా వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ రైతు సంఘం బృందం వ్యవసాయ మార్కెట్ ఆవరణ లో ఉంచిన పెసలు ను రైతులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,పట్టణ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు మాట్లాడుతూ ఆగస్టు రెండో వారం నుంచి కురిసిన వర్షాలకు ఖరీఫ్ సీజన్లో వందలాది ఎకరాల్లో పెసర పంట కోయకుండా పోయింది అని, అరకోర గా రైతులు చేతికి వచ్చిన పెసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు మార్క్ ఫెడ్ చేయకపోవడం వల్ల ప్రవేట్ వ్యాపారులు క్వింటాలకు రూ 4 వేల నుంచి 5 వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్రారంభమైతే కనీసం మద్దతు ధర క్వింటాలకు 8800 రైతులకు లభించే అవకాశం ఉందని వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలని కోరారు అదేవిధంగా కోతకు పనికి రాకుండా పోయిన పెసర పంట కు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు హరి వెంకటేశ్వరరావు, సంక్రాంతి నర్సయ్య, కొల్లి నరసింహారావు,కొమ్మురి శ్రీనివాసరావు, జాలాది గోపాల్ రావు, కామినేని రవి,చిత్తారు మురళి, యనమద్ది రామకృష్ణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >