Posted on 2025-08-14 18:27:42
సీ.ఎస్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్ లు, ఎస్పీలతో వరద పరిస్థితులపై సమీక్ష జరిపారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా రూ. కోటి చొప్పున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అవసరమైన చోట ఈ నిధులను వెచ్చించాలని, ఇంకనూ అవసరమైతే నిధులు కేటాయిస్తామని, నిధుల సమస్య ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. గడచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్‌చలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే లైన్లు, లోలెవెల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా లోలెవెల్ బ్రిడ్జీల దగ్గర పోలీసు సిబ్బందిని నియమించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
చిన్న చిన్న వర్షాలు 200 మిల్లీమీటర్లకే బ్యాక్ వాటర్ వల్ల అక్కడున్న ప్రజలను తరలించవలసి వస్తుందని దీనికి శాశ్వత పరిష్కారం కోసం అక్కడున్నవారిని తరలించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. వర్షాలకు విద్యుత్ వైర్లు తెగిపోయినట్లైతే, తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని, రోడ్లు తెగిపోయిన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సాధారణ జన జీవనానికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ భారీ వర్ష పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నాయని, గురువారం ఉదయం సగటున 23మి. మీ వర్షపాతం నమోదైందని మంత్రులు, సీ.ఎస్ దృష్టికి తెచ్చారు.
జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయినప్పటికీ రానున్న 48 గంటల పాటు భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని, ఎలాంటి పరిస్థితి తలెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సన్నద్ధమై ఉన్నారని తెలిపారు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశామని, అందరూ కార్యస్తానాలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్ రిజార్వాయర్ కు కూడా తక్కువగానే ఇన్ ఫ్లో వస్తోందని, 80.5 టీఎంసీ ల పూర్తి సామర్ధ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో గురువారం నాటికి 45 టీ.ఎం.సీల వరకు నీరు నిలువ ఉందని, పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, శిథిలావస్థకు చేరిన ఇళ్ళలో ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని ప్రజలకు పూర్తి భరోసా కల్పిస్తున్నామని అన్నారు. ఎస్.డీ.ఆర్.ఎఫ్ సిబ్బంది 100 మంది అందుబాటులో ఉన్నారని అన్నారు. వీరితో పాటు శిక్షణ పొందిన మరో 20 మందితో కూడిన పోలీస్, ఫైర్ సిబ్బంది ఉన్నారని, ఒక బృందాన్ని మెదక్ జిల్లాలో సహాయక చర్యల కోసం పంపించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న
Posted On 2026-05-05 13:48:23
Readmore >
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >