| Daily భారత్
Logo




హృదయ విదారక సంఘటన.. భార్య మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన భర్త

News

Posted on 2025-08-11 10:26:44

Share: Share


హృదయ విదారక సంఘటన.. భార్య మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన భర్త

డైలీ భారత్, నాగ్‌పూర్‌: నాగ్‌పూర్‌ లో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నీళ్లు పెట్టించే ఓ ఘటన చోటు చేసుకుంది. ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టుకుని తీసుకెళ్లిన విషాద ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది

నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై అమిత్ తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అమిత్ భార్య తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తోంది. డియోలాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్ఫాటా సమీపంలో ఆదివారం మధ్యాహ్నం వారు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో అమిత్ భార్య అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం తర్వాత అమిత్ ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను సహాయం కోరాడు. కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో చేసేదేం లేక భార్య మృతదేహాన్ని తన బైక్‌కు కట్టుకున్నాడు.

భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టుకుని హైవే మీద ప్రయాణించాడు. అతడిని చూసి కొందరు వాహనదారులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఏ కారణం చేతనో అమిత్ మాత్రం బైక్ అపకుండా నేరుగా తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఆ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ హృదయవిదారక ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >