| Daily భారత్
Logo




వేములవాడలో బ్రాండెడ్ సీసాల్లో చీఫ్ లిక్కర్.. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు

News

Posted on 2025-08-06 16:54:18

Share: Share


వేములవాడలో బ్రాండెడ్ సీసాల్లో చీఫ్ లిక్కర్.. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు

డైలీ భారత్, వేములవాడ: బ్రాండెడ్ మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ మద్యాన్ని నింపి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను వేములవాడ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రాజశేఖర్ రావు పూర్తి వివరాలు వెల్లడించారు. వేములవాడ అర్బన్ మండలం లో రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన తునికి కార్తీక్ అనే యువకుడు బ్లాక్ అండ్ వైట్, విలియమ్స్ , బ్లాక్ డాగ్, రెడ్ లేబుల్, సిగ్నేచర్ వంటి బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఖాళీ మద్యం సీసాలను సేకరించి వాటిలో చీప్ లిక్కర్ మద్యాన్ని నింపి స్థానికంగా విక్రయాలు జరుపుతున్నాడు. ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం కార్తీక్ ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా అక్కడ ఖాళీ నీళ్ల సీసాలలో నింపిన మద్యంతో పాటు పాటు బ్రాండెడ్ సీసాల్లో నింపిన మద్యం లభ్యమైంది.

అనంతరం కార్తీక్ ని విచారించగా వేములవాడ పట్టణానికి చెందిన దామరపల్లి సంతోష్ అనే మరో యువకుడి సాయంతో గత 6 నెలలుగా ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇరువురిని అదుపులోకి తీసుకొని కార్తీక్ వద్ద నుండి 9 రెండు లీటర్ల వాటర్ బాటిల్స్, 9 ఒక లీటర్ వాటర్ బాటిల్స్, 3 సిగ్నేచర్ బాటిల్స్ లోని మద్యాన్ని, అట్లాగే సంతోష్ వద్ద నుండి 750 మిల్లీ లీటర్ల పరిణామంతో కూడిన 3 సిగ్నేచర్ బాటిల్స్, 3 విలియమ్స్ బాటిల్స్, ఐ.బి, ఆర్.సి రెడ్, రాయల్ గ్రీన్ బాటిల్స్ ఒక్కొక్కటి, అర్థ లీటర్ ఆర్.సి రెడ్ బాటిల్ ఒక్కటి స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ సుమారు 50 వేల వరకు ఉంటుందని, గత 6 నెలలుగా వీరు సుమారు 2 లక్షల వరకు వ్యాపార లావాదేవీలు కొనసాగించినట్లు ప్రాథమిక అంచనా వేసి, తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రవి, టాస్క్ ఫోర్స్ ఎస్సై శైలజ, కానిస్టేబుల్ రాజు, యుగేందర్, సాయి కృష్ణ, శ్రీనివాస్, రాకేష్, సంజీవ్, స్రవంతి, లత తదితరులు పాల్గొన్నారు

Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >