| Daily భారత్
Logo




అజ్ఞాతంలోకి వెళ్లిన బిగ్‌బాస్‌ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌

News

Posted on 2023-12-20 08:19:31

Share: Share


అజ్ఞాతంలోకి వెళ్లిన బిగ్‌బాస్‌ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌

డైలీ భారత్, హైదరాబాద్: రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లోకి వెళ్లి సెన్సేషన్ అయిన పల్లవి ప్రశాంత్‌.. బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచి బయటికి వచ్చిన వెంటనే కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటకు వస్తునే ర్యాలీ తీసిన సమయంలో జరిగిన గొడవ ఇప్పుడు కేసులు వరకూ వెళ్లింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అజ్ఞాతంలో ఉన్నారు. కేసులు నమోదుకాగానే కనిపించకుండాపోయారు ప్రశాంత్‌. ప్రశాంత్‌ లాయర్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వచ్చి కేసు వివరాలు సేకరించనున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రశాంత్ లాయర్ రాజ్‌కుమార్‌ సిద్దమయ్యారు. కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పుకుంటున్న కొందరు చేసిన న్యూసెన్స్ అంతా ఇంతా కాదు. అభిమానం పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు.. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్‌బాస్‌ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను పోలీసుల సహకారంతో వేరే మార్గం నుంచి బయటికి పంపించింది. అయితే పల్లవి ప్రశాంత్‌ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్‌బాస్‌ యాజమాన్యం సూచనలను బేఖాతర్‌ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్‌ టాప్‌ జీప్‌పై చేరుకోవడంతో రచ్చ స్టార్ట్ అయ్యింది. బస్సులపై రాళ్లు రువ్వడం, మిగతా కంటెస్టెంట్‌ల కార్లపై కొందరు దాడి చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. అమర్‌దీప్, అశ్విని, బిగ్ బాస్ బజ్ హెస్ట్ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఐతే.. విన్నర్‌గా గెలిచినందునే తాను అందరినీ కలిసి వెళ్లాలి అనుకున్నానంటూ ప్రశాంత్‌ చెప్పుకొచ్చాడు.

పోలీసులు ఈ ఘటనపై సుమోటోగా ఈ కేసు పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కారు నడిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు కేసులు పెట్టగా ఒక దాంట్లో పల్లవి ప్రశాంత్ పేరు కూడా చేర్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నాన్ బెయిలబుల్ కావడంతో ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >