| Daily భారత్
Logo




బంజారా సామాజిక ప్రజల హక్కుల సాధనకే ఏ ఐ బి ఎస్ ఎస్ ఏస్ ఏర్పాటు

News

Posted on 2025-07-27 16:54:55

Share: Share


బంజారా సామాజిక ప్రజల హక్కుల సాధనకే ఏ ఐ బి ఎస్ ఎస్ ఏస్ ఏర్పాటు

బంజారా ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య వక్తలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బంజారా సామాజిక వర్గానికి చెందిన ప్రజల హక్కులు, మరియు వారికి వారికి సామాజిక న్యాయం కల్పించడం కోసమే అఖిల భారతీయ బంజారాసేవా సంఘ్ ఏర్పాటయిందని మాజీ ఎంపీ ఏఐబిఎస్ ఎస్ జాతీయ అధ్యక్షులుఉమేష్ జాదవ్  మాజీ ఎమ్మెల్సీ, సబావట్ రాములు నాయక్  లు పేర్కొన్నారు. బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజల హక్కులు, సంక్షేమం, కోసం పాటుపడి వారి రాజకీయ, సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి కోసం కృషి చేసే సంస్థ అని అన్నారు. ఇది దేశ వ్యాప్తంగా బంజారాలపై జరుగుతున్న అన్యాయాన్ని, దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సంఘానికి బలోపేతం చేయడమన్నారు. జాతి ఐక్యత కోసం అహర్నిశలు శ్రమించడం, వారి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు.1952 సంవత్సరంలో అఖిల భారతీయ బంజారా సేవా సంఘం మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా డిగ్రీస్ తాలుకా లోని ఒక ప్రైవేటు వసతి గృహంలో చదువుతున్న బంజారా విద్యార్థులు కలిసి విద్యార్థి సంఘం నాయకుడైన ఆడే ప్రతాప్ సింగ్ నాయకత్వంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అఖిల భారతీయ బంజారా సేవా సంఘం 30 జనవరి 1953లో మహారాష్ట్ర లోని యవత్మాల్ జిల్లా లోని డిగ్రేశ్ తాలుకాలో దేశ నలుమూలల నుండి వచ్చిన బంజారాలు తొలిసారిగా రెండు రోజులు సెమినార్ ఏర్పాటు చేశారు. అనంతరం దేశంలోని బంజారా ప్రముఖుల సూచనలు సలహాలు పాటిస్తూ అఖిల భారతీయ బంజారా సేవా సంఘాన్ని స్థాపించారు.

ఈ సంఘానికి మహారాష్ట్ర లోని మాండ్వి గ్రామం కిన్వట్ తాలుకా నాందేడ్ జిల్లాకు చెందిన తొలి బంజారా హింగోలీ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు ఉత్తమరావు బలిరాం రాథోడ్ని సంఘం తొలి అధ్యక్షుడిగా, ఆడే ప్రతాప్ సింగ్ని ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి నియమించారు. బంజారా సమాజ ముఖ్యులు 1952లో తొలిసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికైన బంజారా తొలి శాసన సభ్యులు, మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి వసంత్య్రాన్ నాయిక్ అధ్యక్షతన జరిగిన సభలో తొలి బంజారా పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సింగ్ భానావత్ సలహాదారుల నాయకత్వంలో బంజారా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర అడ్వైజర్ కిషన్ సింగ్ రాథోడ్, ఉపాధ్యక్షుడు నేనావత్ శ్రీహరి నాయక్, లతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


Image 1

బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని వద్ద రక్షణ చర్యలను పర్యవేక్షించిన విశాఖ నగర సిపి

Posted On 2025-12-10 20:33:49

Readmore >
Image 1

హత్య కేసులో 08 మంది నింధుతుల అరెస్ట్

Posted On 2025-12-10 19:56:14

Readmore >
Image 1

మొదటి విడత పోలింగ్ కు కట్టుదిట్టమైన భద్రత : జిల్లా ఎస్పీ

Posted On 2025-12-10 18:15:45

Readmore >
Image 1

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల

Posted On 2025-12-10 17:38:13

Readmore >
Image 1

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు

Posted On 2025-12-10 17:33:48

Readmore >
Image 1

కొత్త డిసిసి అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గట్టేక్కిస్తాడా..!

Posted On 2025-12-10 17:25:12

Readmore >
Image 1

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూవీ మేకప్ ఆర్టిస్ట్ సాయిబాను

Posted On 2025-12-10 17:24:14

Readmore >
Image 1

గ్రామాన్ని దత్తత తీసుకున్న మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు

Posted On 2025-12-10 17:17:33

Readmore >
Image 1

సమాజంలో ప్రతి పౌరుడికి మౌలిక హక్కులు కల్పించాలి : మానవ హక్కుల సంఘం చైర్మన్ గుజ్జె శివరామ్

Posted On 2025-12-10 17:15:11

Readmore >
Image 1

ఇంటి పన్ను వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2025-12-10 08:52:42

Readmore >