| Daily భారత్
Logo




సీనియర్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

News

Posted on 2025-07-20 17:52:33

Share: Share


సీనియర్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 అతిథిగా విచ్చేసిన ఎస్పీ రోహిత్ రాజ్ 

పేదలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ బాబురావు, రాజశేఖర్ అయ్యప్ప, స్రవంతి

సంతోషం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు

డైలీ భారత్, జూలూరుపాడు, భద్రాద్రి న్యూస్:జూలూరుపాడు మండల పరిధిలో నల్లబండ బోడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం సీనియర్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ప్రజల సంక్షేమం కోసం జిల్లాలోని పోలీసు వ్యవస్థ మీడియా మరియు వైద్య బృందం కలిసి చూపిన సామర్థ్యానికి హృదయపూర్వక అభినందనలు గ్రామ ప్రజలు తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరానికి అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న నాయకుడిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎస్పీ రోహిత్ రాజ్ కేవలం పోలీస్ అధికారి మాత్రమే కాదు ప్రజల పట్ల సానుభూతితో ముందుకు సాగుతున్న ఒక నిజమైన ప్రజానాయకుడు ఆయన సాధారణ ప్రజల మధ్యకు వచ్చి ఆరోగ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం అతిథిగా హాజరై ప్రజలకు మానవతా స్పృహను చేరవేయడం గొప్ప విషయం.  ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 24 గంటలు చాలా బిజీ గా రోగులకు వైద్యం అందిస్తూ ఉంటూ కేవలం ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సమయాన్ని కూడా వదులుకొని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి సమయాన్ని కేటాయించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బాబురావు, రాజశేఖర్ అయ్యప్ప, స్రవంతి లను ఎస్పీ ప్రశంసించారు. గ్రామస్తులంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాగా చదివించాలని గ్రామస్తులను కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. మారుమూల ఆదివాసి గిరిజన గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జూలూరుపాడు సీనియర్స్ ప్రెస్ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వైద్యులు  రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ రోహిత్ రాజుకు  ప్రెస్ క్లబ్ సభ్యులతోపాటు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిధులను శాలువాతో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్బిసిఐ శ్రీనివాస్, శ్రావణి మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ఢిల్లీ వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక చంద్రశేఖర్, ఆదివాసి గిరిజన నాయకులు బచ్చల లక్ష్మయ్య, కొర్స రమేష్ తోపాటు, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >