| Daily భారత్
Logo




24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!

News

Posted on 2026-07-18 10:20:51

Share: Share


24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!

డైలీ భారత్, మునుకుంట్ల: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో 24 గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఇద్దరు యువతీయువకుల మరణాలు తీవ్ర సంచలనంగా మారాయి. సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన లక్ష్మీ ప్రసన్న (23) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోగా, మరుసటి రోజే ఆమె ప్రియుడు రామ్ చరణ్ (22) ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ రెండు మరణాల వెనుక బలమైన ప్రేమ కోణం దాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంట్లో శవమై కనిపించిన ఎంబీబీఎస్ విద్యార్థిని...

మునుకుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే ప్రసన్న, శుక్రవారం రాత్రి తన నివాసంలో ఉరికి వేలాడుతూ నిర్జీవంగా కనిపించింది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కట్టంగూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్స నికిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రసన్న మృతి సాధారణ ఆత్మహత్య కాదని, ఆమె మరణంపై అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ అనే యువకుడి ప్రమేయం ఉందంటూ యువతి కుటుంబ సభ్యులు గట్టిగా అనుమానాలు వ్యక్తం చేశారు.

తాటి చెట్టుకు ఉరివేసుకున్న చరణ్...

లక్ష్మీ ప్రసన్న మృతిపై తనపై అనుమానాలు వస్తున్నాయని, పోలీసులు రంగంలోకి దిగారని తెలియడంతో శనివారం ఉదయం మరో ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన రామ్ చరణ్ శనివారం తెల్లవారేసరికి గ్రామ శివారులోని ఒక తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మీ ప్రసన్న మరణించిన కొన్ని గంటల్లోనే చరణ్ కూడా బలవన్మరణానికి శరణు జొచ్చడం ఊహించని ట్విస్ట్‌గా మారింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోవడంతో మునుకుంట్ల గ్రామం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గ్రామంలో ప్రస్తుతం విషాద వాతావరణం నెలకొంది.

ప్రేమ వ్యవహారమే కారణమా?

గ్రామస్థుల సమాచారం ప్రకారం, లక్ష్మీ ప్రసన్న, రామ్ చరణ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా, లేదా కుటుంబాల నుండి ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరోవైపు, లక్ష్మీ ప్రసన్నది ఆత్మహత్యా లేక చరణ్ ఆమెను హత్య చేసి, ఆ భయంతో తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పోలీసులు ఇద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే ఈ జంట మరణాల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడుతుందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >