Posted on 2025-07-20 15:10:55
పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని జాతరను తలపించిన కోట గల్లి ప్రాంతం
ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్న నూడా చైర్మన్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆషాడ మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లి ప్రాంతంలో కోట మైసమ్మ ఆలయ అధ్యక్షుడు అంతిరెడ్డి దేవేందర్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామున నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు భక్తులు నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నూడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్ లు హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు అంతిరెడ్డి దేవేందర్ మాట్లాడుతూ ఎంతో మహిమగల కోట మైసమ్మ ఆలయంలో భక్తుల కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి కెక్కారని కోట గల్లి ప్రాంతవాసులనే కాకుండా ఆ అమ్మవారు నిజామాబాద్ నగర వాసులందరిని కాపాడుతూ వస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం నూడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ తాను చిన్ననాటి నుండి ఈ అమ్మవారి మహిమను తెలుసుకుంటూ వస్తున్నానని భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ వారికి ఎలాంటి ఆపద రాకుండా ఆ అమ్మవారు తోడుగా వారికి అండగా నిలుస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయం అన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >