| Daily భారత్
Logo




తీరు మార్చుకొని భార్యను హతమార్చిన భర్త

News

Posted on 2025-07-20 04:55:51

Share: Share


తీరు మార్చుకొని భార్యను హతమార్చిన భర్త

డైలీ భారత్, కడప: కడప జిల్లాలో వరుస హత్యకేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన మైనర్‌ బాలిక హత్య ఘటన నుంచి జిల్లా వాసులు తేరుకోకముందే మరో హత్య జరిగింది. వివాహేతర సంబంధానికి దూరంగా ఉండాలని భర్త పదే పదే హెచ్చరించిన భార్య తీరు మార్చుకోకపోవడంతో ఆగ్రహించిన భర్త ఆమెను గొంతుకోసి హత్యచేసి.. ఆ తర్వాత మృతదేహాన్ని అడవిలో పడేశారు. తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న ఘటనల్లో దాదాపు 90శాతం వివాహేతర సంబంధాలకు ముడిపడినవే ఉంటున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు గుర్తించిన భర్త ఆగ్రహంతో ఆమెను హత్యచేసి అడవిలో పడేశాడు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. పెద్ద చీపాడు గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళలో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గోపాల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా భార్య ఇంట్లోనూ ఉంటూ పిల్లలను చూసుకుంటుంది.

అన్యోన్యంగా సాగుతున్న వీళ్ల జీవింతంలోకి మూడో వ్యక్తి ఎంటర్‌కావడం పెను ఆనార్థాలకు దారి తీసింది. ఇంట్లో ఉంటున్న భార్య సుజాతకు కల్లూరుకు చెందిన తాపీ మేస్త్రీతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్.. ఈ వ్యవహారాన్ని బంధువుల దృష్టికి తీసుకెళ్లి.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పెద్దలు వాళ్లకు సర్థిచెప్పి మరోసారి ఇలా చేయొద్దని భార్యకు బుద్ది చెప్పారు. అయినా భార్య ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు.. ఇలా అయితే కుదరదని అనుకున్న భర్త గోపాల్‌ ఫ్యామిలీని హైదరాబాద్‌కు తరలించాడు. అయితే హైదరాబాద్‌ వెళ్లిన కొంత కాలానికే భార్య మళ్లీ తిరిగి స్వగ్రామం పెద్దచీపాడుకు వచ్చి యోధావిధిగా ప్రియుడు తాపీ మేస్త్రీలో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్‌ ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే స్వగ్రామానికి చేరుకొని ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సంచిలో మూటకట్టుకొని తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసి ఇంటికి వచ్చాడు. తర్వాతి రోజు పోలీసులకు లొంగిపోదామని అనుకొని మైదకూరు పీఎస్‌ ప్రాంతానికి వచ్చాడు. కానీ అతనికి ధైర్యం చాలకపోవడంతో తనకు తెలిసిన ఒక హెడ్‌కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అతడు లొంగిపోవాలని సూచించడంతో.. కాసేపటికే గోపాల్‌ చాపాడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >