Posted on 2023-12-17 16:34:03
జిల్లా సరిహద్దు నుంచి వేములవాడ వరకు అంబరాన్ని అంటేలా స్వాగత ఏర్పాట్లు
జిల్లెల నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకు భారీ బైక్ ర్యాలీలు, గజ మాలలతో ఘన సత్కారాలతో స్వాగతాలు
ర్యాలీ అనంతరం వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం వస్తున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల క్రాసింగ్ వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు మండల నాయకులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్చం అందించి ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నటువంటి ప్రాంత ఎమ్మెల్యే కు ప్రభుత్వ విప్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, దీనికి ప్రత్యేక కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆది శ్రీనివాస్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలని వారు ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ విప్ గా తోడ్పాటు అందించాలని కోరారు. కాంగ్రెస్ నేతలు గజమాలతో సత్కరించారు. అనంతరం నేరుగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యల పాల్గొన్నారు..
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >