| Daily భారత్
Logo




ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

News

Posted on 2025-07-12 16:23:54

Share: Share


ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే  డాక్టర్ భూపతి రెడ్డి

ఇండ్ల నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడొద్దు కాంట్రాక్టర్లకు ఆదేశం

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ నియోజవర్గం లోని ధర్పల్లి మండల కేంద్రంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ళను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే  డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు  నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాణం చేసే విధంగా చూడాలని  అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని  ప్రతి ఒక్కరు కూడా అర్హత  ఉన్నవారికి  ఇల్లు వస్తాయని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులతో మాట్లాడుతూ  ఎవరైనా డబ్బులు అడిగారా.. అడిగితే నాకు వెంటనే ఫోన్ చేయండి అని అన్నారు. లబ్ధిదారులు  స్పందిస్తూ  కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సొంత ఇల్లు కల  నెరవేరుతుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారని  అన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు.


ఎమ్మెల్యే వెంట ధర్పల్లి మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు , లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు   పాల్గొన్నారు.


#nizamabad

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >