| Daily భారత్
Logo




“భార్యాభర్తల వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్”

News

Posted on 2025-07-09 08:50:51

Share: Share


“భార్యాభర్తల వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్”

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బి. వై. నగర్‌లోని కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈ రోజు మనో వికాస సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్  పాల్గొని, కుటుంబ సమస్యల పరిష్కారం గురించి విలువైన అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతూ –

‘‘ఈ కాలంలో భార్యాభర్తల మధ్య వివాదాలకు ప్రధాన కారణం పరస్పర అర్థం చేసుకోలేకపోవడమే అని అన్నారు.

ప్రతి వ్యక్తి యొక్క భావాలు, ఆలోచనలు, అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయని తెలుపుతూ అవి గమనించి గౌరవించే దిశగా ప్రయత్నించకపోతే కుటుంబంలో కలహాలు వస్తాయని అన్నారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అన్నారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్ వల్ల లాభాలను గురించి పున్నంచందర్ వివరిస్తూ

పరస్పర అర్థం చేసుకోవడం పెరుగుతుందనీ తెలుపుతూ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే విధానాన్ని నేర్చుకుంటారని అన్నారు.

సందేహాలు, అపోహలు తొలగి నిజమైన భావాలను వ్యక్తీకరించే వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

ఓర్పు,  సహనశీలత పెరిగి కోప పడకుండా సానుకూలంగా స్పందించే నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

తీవ్రమైన వివాదాలు తగ్గి , చిన్న విషయాలను పెద్దగా చేసుకోకుండా సమస్యలను నిర్మాణాత్మకంగా చర్చించటం అలవడుతుందని తెలిపారు.

ఆత్మవిశ్వాసం పెరిగి , వ్యక్తిగత సమస్యల్ని కూడా ఎదుర్కొనే ధైర్యం వస్తుందని అన్నారు.

సంబంధాలు బలపడడం వల్ల విడాకుల దశ వరకు వెళ్లే అవకాశం ఉండదని అన్నారు.

అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గి, మనశ్శాంతి పెరుగుతుంది తెలిపారు.

"సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కోవడం, మాట్లాడుకోవడం, పరిష్కారం వెతకడం చాలా అవసరం అని తెలిపారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒక దిశానిర్దేశం మాత్రమే కాదు, అది కుటుంబ జీవితం పునరుత్తేజం పొందే ఒక సానుకూల మార్గం." అని వివరించారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం మైండ్ కేర్ సెంటర్ లో తమను సంప్రదించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో  మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, కొండ ఉమ పలువురు మహిళలు, కార్మికులు పాల్గొన్నారు.

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >