Posted on 2025-07-08 15:08:15
PSHM పోస్టుకు B,Ed,. D,.Ed,. సమాన అర్హతగా పరిగణించాలి
ప్రాథమిక పాఠశాలలో రేషనలైజేషన్ నిబంధనలు మార్చాలి
TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దుమాల రమానాధ్ రెడ్డి, విక్కుర్తి అంజయ్య డిమాండ్
ఈ రోజు TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం సిరిసిల్లలో నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన 10 వేల PSHM పోస్టులు మంజూరు చేసి ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టు ఇవ్వాలని అన్నారు గత ప్రభుత్వం ప్రకటించిన పదివేల పోస్టులు ఇంతవరకు మంజూరు చేయలేదని వాటిని వెంటనే మంజూరు చేసి ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పాఠశాలలను తీర్చిదిద్దాలని వారు డిమాండ్ చేశారు ప్రాథమిక పాఠశాలలో విద్య బాగుంటేనే విద్యా రంగం అభివృద్ధి చెందుతుందని ప్రాథమిక స్థాయిని నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుందని వారు అన్నారు..
అదేవిధంగా B,Ed అర్హత కలిగిన Sgt ఉపాధ్యాయులకు కూడా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు , అంతే కాకుండా ప్రాథమిక పాఠశాల లో రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలను మూసివేసే కుట్ర జరుగుతుందని 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించడం వల్ల విద్యార్థుల అభ్యసన తీవ్రంగా నష్టపోతుందని అందువల్ల ప్రభుత్వం 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలని 20 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులను 40 విద్యార్థుల పైన ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.. అదేవిధంగా ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా నిబంధనలను సవరించాలని వారు పేర్కొన్నారు..
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, ఉపాధ్యక్షులు మందాడి శ్రీనివాస్ రెడ్డి, కెవి రజినీ రాణి, జిల్లా కార్యదర్శి మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం, ఎడ్ల కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా అకాడమిక్ సెల్ కన్వీనర్ బుస రాజేందర్ లు పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >