Posted on 2025-07-04 04:23:55
డైలీ భారత్, మహబూబాబాద్: ఖమ్మం - వరంగల్ మధ్య జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యారు. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఖమ్మం – వరంగల్ మధ్య జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యారు. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా క్యాబిన్‌లో మంటలు చేలరేగి ఈ దారుణం చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొట్టాయి. ఒక లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ముగ్గురు అందులోనే సజీవ దహనం అయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఒక లారీ విజయవాడ నుండి పౌల్ట్రీ మెటీరియల్ లోడ్ తో గుజరాత్‌కు వెళ్తోంది. గ్రానైట్ లోడ్ లారీ వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తోంది. శుక్రవారం(జూలై 04) తెల్లవారుజామున ఈ రెండు లారీలు వేగంగా డీ కొనడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్యాబిన్‌లో సజీవదహనం అయిన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో ఖమ్మం – వరంగల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >