| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తల్లి ప్రాణం విలవిల.. స్కూలుకు తీసుకెళ్తుండగా కొడుకు మృతి

తల్లి ప్రాణం విలవిల.. స్కూలుకు తీసుకెళ్తుండగా కొడుకు మృతి

డైలీ భారత్, హైదరాబాద్: తల్లి కళ్లెదుటే కుమారుడు కన్నుమూసిన విషాద ఘటన హైదరాబాద్లో జరిగింది. 1వ తరగతి చదువుతున్న కొడుకును తీసుకొని తల్లి స్కూటీపై స్కూలుకు బయల్దేరింది. దుండిగల్ PS పరిధిలోని మల్లంపేట్ పల్లవి స్కూల్ ముందు స్కూటీ అదుపుతప్పింది. ఇద్దరూ కిందపడగా బాలుడి తలపైనుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న కొడుకు తల ఛిద్రం అవడాన్ని చూసిన తల్లి తట్టుకోలేక విలవిల్లాడింది.

Previous పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు
Next గుండెపుడి రెవెన్యూ 117లో అక్రమాలపై విచారణ జరపాలి
ADVERTISEMENT