| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎలక్ట్రికల్ బైక్ పేలి మహిళ మృతి

ఎలక్ట్రికల్ బైక్ పేలి మహిళ మృతి

డైలీ భారత్, కడప: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికి ఈ బైక్ పేలుడు సంభవించింది.

ఎలక్ట్రికల్ బైక్ పేలి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కల్పోయిన విషాద ఘటన కడప జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి  గ్రామంలో ఓ ఇంట్లో రోజు మాదిరిగానే ఎలక్ట్రికల్ స్కూటర్‌కు చార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలోనే షాట్ సర్క్యూట్ కారణంగా బైక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బైక్ పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ(62) మంటల ధాటికి పూర్తిగా కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Previous జగన్నాథ రథ యాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు!
Next పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు
ADVERTISEMENT