Posted on 2025-06-12 15:10:57
విమాన ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం
డైలీ భారత్, అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చాలా మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. లండన్‌కి వెళ్తున్న ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. వేగంగా నేలను ఢీకొట్టడంతో విమానంలో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. అయితే, ఇప్పుడు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.
ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. విమానంలో కీలకమైన ‘‘బ్లాక్ బాక్స్’’ దొరికితే కారణాలు తెలిసే అవకాశం ఉంది.
బ్లాక్ బాక్స్ అనేది విమాన పనితీరు, పైలట్ల మధ్య సంభాషణలను రికార్డ్ చేసే ఒక పరికరం. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ రెండు భాగాలను బ్లాక్ బాక్స్‌గా పరిగణిస్తారు. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం ఎంత ఎత్తులో ఉంది..? ఎంత వేగంతో ప్రయాణిస్తుంది..?, ఫ్లైట్ కంట్రోల్స్ పనితీరును రికార్డ్ చేస్తుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ఎత్తు, వేగం, ఇంజిన్ థ్రస్ట్, ఫ్లైట్ పాత్ డేటాతో సహా కీలకమైన టెక్నికల్ పెరామీటర్స్‌ని నమోదు చేస్తుంది. ఇక కాక్ పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ల మధ్య సంభాషణలు, ఏటీసీ నుంచి వచ్చే ఆదేశాలు వంటి వాటిని సేకరిస్తుంది.
బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం సులువు అవుతుంది. సహజంగా బ్లాక్ బాక్సులు అత్యంత దృఢంగా ఉంటాయి. ఎలాంటి ప్రమాదానైనా తట్టుకుంటాయి. ప్రకాశవంతమైన నారింజ కలర్‌లో ఉండే ఈ బాక్స్ పేలుళ్లు, మంటలు, నీటి పీడనాన్ని, హై స్పీడ్ క్రాష్ లను తట్టుకుంటుంది. 25 గంటల సమాచారాన్ని నిల్వ చేస్తుంది
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >