| Daily భారత్
Logo




2 లక్షల నకిలీ ఇంజన్ ఆయిల్ మరియు 14 లక్షల విలువ గల టొయోటా కారు సీజ్ చేసిన సూర్యాపేట జిల్లా CCS మరియు పోలీస్

News

Posted on 2025-05-30 18:55:52

Share: Share


2 లక్షల నకిలీ ఇంజన్ ఆయిల్ మరియు 14 లక్షల విలువ గల టొయోటా కారు  సీజ్ చేసిన సూర్యాపేట జిల్లా CCS మరియు పోలీస్

2 లక్షల నకిలీ ఇంజన్ ఆయిల్ మరియు 14 లక్షల విలువ గల టొయోటా కారు  సీజ్ చేసిన సూర్యాపేట జిల్లా CCS మరియు కోదాడ  రూరల్ పోలీస్.

- కోదాడ రూరల్ పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు.

- ఆయిల్ కంపెనీలో పని చేసిన అనుభవంతో సొంతంగా నకిలీ వ్యాపారం మొదలు పెట్టిన నిందితుడు.

- ఇలాంటి వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరంగా కటిన చర్యలు తప్పవు.

నరసింహ IPS, ఎస్పి సూర్యాపేట జిల్లా.

డైలీ భారత్, సూర్యాపేట: జిల్లా పోలీసు కార్యలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ

కేసు వివరాలు.

ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ చెందిన కాకాని నాగ వేంకటేశ్వర రావు వయస్సు : 48  సం.లు, వృత్తి: వ్యాపారం, ఓల్డ్ రాజా రాజేశ్వరిపేట, విజయవాడ, NTR జిల్లా, అను అతను విజయవాడలో ని పాలిటెక్నిక్ ప్రభుత్వ కాలేజీలో  డిప్లొమా & ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివినాడు.  1998 నుండి విజయవాడలోని Lubricants ఇంజన్ ఆయిల్ కంపెనీలో ఇంజన్ ఆయిల్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేసినాడు. ఇంజన్ ఆయిల్ తయారీలో అనుభవం వచ్చింది. సులభముగా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు . ఆ సమయంలో అతను డూప్లికేట్ ఇంజన్  ఆయిల్(నకిలీ ఇంజన్ ఆయిల్)  తీసుకొచ్చి లేదా తయారుచేసి మంచిగా కంపెనీ స్టిక్కర్లు వేసి  అమ్మాలని ఆలోచన వచ్చింది. షాప్ లో వాళ్లకి అమ్మితే వాళ్లు గుర్తుపడతారని అని బైకు మెకానిక్ లకు తక్కువ దరకు సరఫరా చేయాలని ఆలోచనతో కలకత్తా నుండి Castrol, Pro Honda, Hero, Servo, Bajaj DTS మొదలగు స్టిక్కర్లు, లేబుల్స్ మరియు ప్లాస్టిక్ టిన్స్ తెప్పించి విజయవాడలో దొరికే మడ్డి ఆయిల్ ఫిల్టర్ చేసే  వారి వద్ద నుండి నకిలీ ఇంజన్ ఆయిల్ తక్కువ దరకు పెద్ద పెద్ద డ్రమ్ములు  కొనుగోలు చేసి విజయవాడలో తన  ఇంటి వద్దనే లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్ లో  నకిలీ ఇంజన్ ఆయిల్ నింపి  టిన్ క్యాప్స్ సీల్ చేసి అతను  కలకత్తా నుండి తెప్పించిన Castrol, Pro Honda, Hero, Servo, Bajaj DTS వివిధ కంపెనీల గల స్టిక్కర్లు అతికించి ఐరన్ బాక్స్ తోటి ఇస్తిరి చేసి కంపనీ బాటిల్స్ ఏవిధంగా ఉంటాయే అదే విధంగా తయారు చేసి  Castrol, Pro Honda, Hero, Servo స్టికర్స్ 20 లీటర్ బాటిల్స్ కలసి ఒక Cartons లో ప్యాక్ చేసి మరియు  Bajaj DTS 10 లీటర్ బాటిల్స్ కలసి ఒక Cartons లో ప్యాక్ షాప్స్ వాళ్ళకి  అమ్మితే  వారు అనుమానం వస్తుందని బైక్ మెకానిక్ లకు గుర్తుపట్టని విధంగా  లీటర్ 200 రూపాయల చొప్పున అమ్ముతూ బైక్ మెకానిక్ వాళ్ళని మోసం చేస్తున్నాడు. ఆ విధంగా 2009 వరకు ఇట్టి వ్యాపారం చేసినాడు. 2007 సంవత్సరంలో విజయవాడలో తన  ఇంటిలో నకిలీ ఇంజన్ ఆయిల్ బాటిల్స్ లో నింపుతుండగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ వారు పట్టుబడి చేసి కేసు నమోదు చేసినారు. రెండు రోజులు విజయవాడ జైల్లో ఉన్నాడు. తర్వాత అట్టి వ్యాపారం బంద్ చేసి అగ్రిగోల్డ్ సంస్థ లోమార్కెటింగ్  ఉద్యోగం 2017 వరకు చేసినాడు. తర్వాత అగ్రిగోల్డ్ సంస్థ కంపెనీ మూసి వేయడం జరిగింది. మళ్లీ అతనికి  దురాలోచన వచ్చినది. నకిలీ ఇంజన్ ఆయిల్ మళ్లీ తయారుచేసి డబ్బులు సంపాదించాలని, కలకత్తా నుండి Castrol, Pro Honda, Hero, Servo, Bajaj DTS మొదలగు స్టిక్కర్లు, లేబుల్స్ మరియు ప్లాస్టిక్ టిన్స్ తెప్పించి అనుకున్న విధముగా గత కొన్ని నెలల నుండి నేను నకిలీ ఇంజిన్ ఆయిల్ ను డ్రమ్ లలో తక్కువ రేటు కి  అనగా లీటర్ కు రూ 80 /- చొప్పున విజయవాడ నుండి తీసుకొని వచ్చి ఇట్టి డ్రమ్ లో వున్నటువంటి నకిలీ ఆయిల్ లీటర్ బాటిల్స్ లో నింపి కారు లో వేసుకొని ఎక్కువ రేటు కు లీటర్ కు రూ 200  /- చొప్పున నేరేడుచర్ల, మిర్యాలగూడ  బైక్ మెకానిక్ వాళ్ళకి అమ్ముతున్నాడు. అదే విధంగా ఇట్టి 6  కంపనిలకు చెందిననకిలీ ఇంజన్ ఆయిల్  1. Castrol (Maggi Box) – 5  Cartons (ఒక్కొక్క  Cartonలో  20 Bottles) 2. Pro Honda – 02  Cartons (ఒక్కొక్క Cartonలో  20 Bottles) 3. Hero  - 01  Carton (1 Carton 20 Bottles) 4.Servo – 04 Cartons  (ఒక్కొక్క  Cartonలో 20 Bottles) 5.Castrol  (Original Box) – 7 Cartons (ఒక్కొక్క Cartonలో 20 Bottles) 6. Bajaj DTS-01  Carton  (1 Carton 10 Bottles) మొత్తం 20 Cartons బాక్స్ లను ప్యాక్ చేసుకొను కొత్త టయోటా రోమియో కారు లో  Cartons వేసుకొని వెళ్తుండగా  తేదీ 30.05.2025 రోజు ఉదయం సుమారు 07:00 గంటల సమయంలో రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి సూర్యపేట్ జిల్లా సి‌సి‌ఎస్ పోలీసు మరియు రూరల్ పోలీసులు సంయుక్తంగా CCS CI శివ, వారి సిబ్బంది మరియు కోదాడ రూరల్ SI అనిల్ రెడ్డి మరియు సిబ్బంది వెళ్ళి పట్టుబడి చేసి ఈ క్రింది వాటిని స్వాదినం చేసినారు.

స్వాదినం చేసుకున్న సరుకు వివరాలు

14 లక్షల విలువ గల టొయోటా కారు  మరియు 2 లక్షల నకిలీ ఇంజన్ ఆయిల్ 

1. Castrol (Maggi Box) - 10 Cotton     (ఒక్క బాక్స్ లో 20 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 1000 ml ఉంటుంది)

2. Pro Honda - 03 Cottons (ఒక్క బాక్స్ లో 20 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 1000 ml ఉంటుంది)

3. Hero  - 02 Cottons  (ఒక్క బాక్స్ లో 20 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 1000 ml ఉంటుంది)

4. Servo  - 09 Cottons (ఒక్క బాక్స్ లో 20 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 1000 ml ఉంటుంది)

5. Castrol  (Original Box) -18 Cottons(ఒక్క బాక్స్ లో 20 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 1000 ml ఉంటుంది)

6. Bajaj DT -08 Cottons (ఒక్క బాక్స్ లో 20 టిన్నులు ఉన్నవి, ఒక్క టిన్ను 1000 ml ఉంటుంది)

TOTAL            -50 Cottons  

7. Emty tins Bajaj                  -  150 

8. Stickers Bajaj  – Un used     -  09

9. Stickers Bajaj –     used     -    06

9. Cover  Seals                    -  02(200) + Paper Seals (200)

10. Tin caps                          -   150

11. Iron Box                         -   1

స్వాధీనం చేసుకున్న 14 లక్షల విలువ గల టొయోటా కారు  మరియు 2 లక్షల నకిలీ ఇంజన్ ఆయిల్  మొత్తం సుమారు Rs 16 ,00,000/- 

ఇట్టి నేరస్తుడు కాకాని నాగ వేంకటేశ్వర రావు పై  కేసు నమోదు చేసి పరిశోధన చేయుచున్నాము. 

ఇట్టి నకిలీ ఆయిల్ వ్యాపారాన్ని బట్ట బయలు చేసి నేరస్తున్ని పట్టుకొన్న , CCS CI శివ, వారి సిబ్బంది మరియు కోదాడ రూరల్ SI అనిల్ రెడ్డి మరియు సిబ్బందినీ ఎస్పీ అభినందించారు.

ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యపేట డివిజన్ డి‌ఎస్‌పి ప్రసన్న కుమార్, కోదాడ రూరల్ CI రజిత రెడ్డి, CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, కోదాడ రూరల్ SI అనిల్, CCS సిబ్బంది ఉన్నారు. 


Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >