| Daily భారత్
Logo




బీసీ బంధు స్కీమ్ తాత్కాలికంగా నిలిపివేత - మంత్రి పొన్నం ప్రభాకర్

News

Posted on 2023-12-11 05:33:23

Share: Share


బీసీ బంధు స్కీమ్ తాత్కాలికంగా నిలిపివేత - మంత్రి పొన్నం ప్రభాకర్

డైలీ భారత్, తెలంగాణ: బీఆర్‌ఎస్‌ పార్టీ అమలు చేసిన బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. 

దాని అమలుపై సమీక్ష నిర్వహించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశం తరువాత మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖలపై సమీక్షలు చేయకుండా మాట్లాడడం సరియైనది కాదని అభిప్రాయపడ్డారు. సమీక్ష నిర్వహించి వాస్తవాలు తెలుసుకున్న తరువాతనే మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు.

 బీసీ బంధు పూర్తి స్థాయిలో పారదర్శకంగా అర్హులకు చేరేట్లు తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదన్న ఆయన ఉద్యోగులకు, ప్రజలకు ప్రయోజనం కలిగేలా తాము చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతు బంధుపై బీఆర్‌ఎస్‌ నాయకులు అప్పుడే విమర్శలు చేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఖండించారు. తాము అధికారం చేపట్టి రెండు రోజులకే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకు నిదర్శనం అధికార పగ్గాలు చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు హామీలు అమలు చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >