Posted on 2025-05-29 16:09:43
డైలీ భారత్, నంగునూరు: నంగునూరు మండల పరిధిలోని ఒక గ్రామంలో తల్లిగారింటి ఇంటి వద్ద ఉన్న వివాహిత మహిళపై అత్యాచార ప్రయత్నం చేసిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన స్నేహితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రాజగోపాలపేట ఎస్సై ఆసిఫ్, ప్రొబేషనరీ ఎస్సై సౌజన్య తెలిపారు. పాలమాకుల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ సంపంగి మహేష్ అనే వ్యక్తి మండల పరిధిలోని ఒక గ్రామంలో తనకు పరిచయం ఉన్న మహిళపై బుధవారం రాత్రి అత్యాచార ప్రయత్నం చేశాడు. ఇందుకోసం పాలమాకుల గ్రామానికి చెందిన తన స్నేహితుడు పల్లెపు సంపత్ తో ద్విచక్ర వాహనంపై మహిళ తల్లిగారి ఊరికి వెళ్లారు. సంతోష్ ను బయట కాపలా ఉంచి సంపంగి మహేష్ మహిళ ఉన్న ఇంట్లోకి రాత్రి చొరబడి మహిళపై అత్యాచారం చేయబోయాడు. మహిళ అరవడంతో ఆమె తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు నిద్ర లేచారు. దీంతో మహేశ్, సంపత్ లు ద్విచక్రవాహనం మీద పారిపోయారు. గురువారం పాలమాకుల బస్ స్టాండ్ వద్ద టీఎస్ 36 ఏ 0206 నెంబరు గల ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు వివరించారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >