Posted on 2025-05-04 16:13:00
డైలీ భారత్, వరంగల్/ నర్సంపేట: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఇటీవల అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినట్లు తెలిపిన నేపథ్యంలో, మార్కెట్‌లో అధికారులు, రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, "అకాల వర్షాల ప్రభావం నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, పాడి క్లీనర్ ద్వారా శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ధాన్యం నాణ్యత, రైతుల అవసరాలు, డబ్బు చెల్లింపులు తదితర అంశాలను పరిశీలించారు.
ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలని అధికారుల కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాలలో ప్యాడి క్లీనర్ లు, గన్ని బ్యాగులు, తాగునీరును అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటనే జరిగేలా అవసరమైన హమాలీలను సమకూర్చుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, కార్యదర్శి జి.రెడ్డి, తహసీల్దార్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >