Posted on 2025-05-04 14:09:05
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ జలగం యువసేన ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కీ"శే"సర్దార్ జలగం వెంగళరావు 103 వ జయంతి వేడుకలను స్థానిక పూర్ణ టీ స్టాల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జలగం వెంగళరావు చేసిన కృషి ఎంతో గొప్పదని, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత ఆయన సొంతం అని అన్నారు. జిల్లాకు సింగరేణి, నవభారత్,స్పాంజ్ ఐరన్,ఐటిసి,హెవీ వాటర్ ప్లాంట్ వంటి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారని,ఎన్నో ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగానికి ఊపిరిపోశారని, కిన్నెరసాని వంటి ప్రాజెక్టుల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఆ మహానుభావుని చరిత్రను పాఠ్యపుస్తకాలలో ప్రచురించి భవిష్యత్ తరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో TUF జిల్లా అధ్యక్షులు మంజూర్, జమ్ముల సీతారాం రెడ్డి,కేశూలాల్ నాయక్, శ్రీపాద సత్యనారాయణ, బొల్లం భాస్కర్, భాస్కర్ రావు,టైగర్ దుర్గాప్రసాద్ ,సమ్మిరెడ్డి జనార్ధన్ రెడ్డి, కొండపల్లి సీతారామయ్య,అప్పల నాయుడు,కేసరి రవీందర్,మురళీకృష్ణ, బిల్లా సుజిత్,సురేష్ నాయక్, సుధాకర్, పరమేష్ పెద్దిరాజు గణేష్, సమ్మయ్య, చంద్రశేఖర్ రెడ్డి, తాజుద్దీన్, గణేష్ మహేశ్వరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >