| Daily భారత్
Logo




హైదరాబాద్ చేరుకుంటున్న అందమైన భామలు లేత మెరుపు తీగలు

News

Posted on 2025-05-04 08:07:07

Share: Share


హైదరాబాద్ చేరుకుంటున్న అందమైన భామలు లేత మెరుపు తీగలు

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. మే 10వతేదీ నుంచి 31వతేదీ వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72 వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ముస్తాబు అయింది. 

హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణుల రాక ప్రారం భమైంది.మిస్ కెనడాకు సంప్రదాయ స్వాగతం శనివారం రాత్రి మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. 

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల సుందరాంగులు ఈ నెల 6 వ తేదీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. శంషా  బాద్ విమానాశ్రయానికి చేరుకున్న మిస్ కెనడా కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు.

కెనడా దేశ గొప్ప స్వదేశీ వారసత్వాన్ని సూచించే మిస్ కెనడా ఎమ్మా మోరి సన్ కు ప్రపంచ సౌందర్యం, స్థానిక సంప్రదాయాల కలయికను ప్రదర్శించే శాస్త్రీయ నృత్యంతో స్వాగతం పలికారు.

హైదరాబాద్ లో మిస్ వరల్డ్ అధికారుల మకాం

మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే వివిధ దేశాల అధికారులు హైదరాబాద్ లో మకాం వేసి మిస్ వరల్డ్ 2025 కోసం ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ప్రతిస్ఠాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీల సన్నాహాల్లో భాగంగా లండన్‌లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్ మోర్లీ హైదరాబాద్ రెండు రోజుల క్రితమే చేరుకున్నారు.

మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సమీక్షలు

మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించాల్సిన వివిధ ప్రదేశాలు, ఈవెంట్ ప్లానిం గ్, ఈవెంట్ నిర్వహణలో పాల్గొన్న బహుళ విభాగా లు, ఏజెన్సీలతో మోర్లీ సమీక్షిస్తారు.మిస్ వరల్డ్ సంస్థ నుంచి సీనియర్ అధికారి హెన్రిక్ ఫోంటెస్ కూడా వచ్చారు. 

శంషాబాద్ విమానా శ్రయంలో హైదరాబాద్ మిస్ వరల్డ్ స్థానిక నిర్వాహక బృందం ఆయన కు కూడా హృదయపూర్వక సాంప్రదాయ స్వాగతం పలికింది.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >