| Daily భారత్
Logo




పెరోల్‌పై వచ్చి శిక్షను తప్పించుకొని తిరుగుతున్న జీవిత ఖైదీని పట్టుకొన్న కోదాడ డివిజన్ పోలీసులు

News

Posted on 2025-05-02 16:17:02

Share: Share


పెరోల్‌పై వచ్చి శిక్షను తప్పించుకొని తిరుగుతున్న  జీవిత ఖైదీని పట్టుకొన్న కోదాడ డివిజన్ పోలీసులు

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ నందు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్

హాజరైన అదనపు ఎస్పి నాగేశ్వరరావు, కోదాడ డివిజన్ DSP శ్రీధర్ రెడ్డి, హుజూర్నగర్ CI చరమంద రాజు, మఠంపల్లి SI రాజు, ఐటీ కోర్ RSI రాజశేఖర్.

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా, కోదాడ పోలీస్ డివిజన్, మఠంపల్లి గ్రామానికి చెందిన  బొడ్డు తిరుపతి, 31 స|| రాలు,, అను అతను 2012 సంవత్సరంలో, రాచకొండ (అప్పటి సైబరాబాద్) కమిషనరేట్ లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యకిని దారుణంగా  హత్య చేసిన కేసులో (క్రైం నంబర్ 427/2012) ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యాడు. ఆ తదుపరి, 2015 లో  రంగా రెడ్డి జిల్లా 3 వ అదనపు సెషన్స్  కోర్టు వారు, విచారణ అనంతరం, సదరు తిరుపతికి జీవిత ఖైదు శిక్షను విధించటం జరిగింది. ఆ తర్వాత అట్టి శిక్షను అమలు చేసేందుకు, సదరు తిరుపతిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించటం జరిగింది. అక్కడ జైల్లో C క్లాస్ ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బొడ్డు తిరుపతి (శిక్షా ఖైదీ నంబర్ 4358) 2019 ఆగస్టు 17వ తేదీన ముప్పై రోజుల పెరోల్ పై విడుదల కావటం జరిగింది.  పెరోల్ అనంతరం తిరిగి చర్లపల్లి జైలకు తిరిగిరాకుండా, కోర్టు విధించిన శిక్షను గౌరవించకుండా, సదరు  బొడ్డు తిరుపతి, కావాలనే చట్టం నుండి గత ఆరు సంవత్సరాల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు .

ఈ పరారీలో ఉన్న ఘటనపై చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ నివేదిక ఆధారంగా, మట్టంపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 31/2024, సెక్షన్ 224 IPC ప్రకారం కేసు నమోదు చేశారు.

చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న ఈ కేసు విషయంలో సూర్యాపేట జిల్లా ఎస్‌పి కె. నరసింహ, IPS ఆదేశాల మేరకు, కోదాడ డివిజన్ డీఎస్పీ (SDPO) ఎం. శ్రీధర్ రెడ్డి ఈ కేసు వివరాలను తిరిగి క్షుణ్ణoగా పరిశీలించి, కొన్ని ఆధారాలను సేకరించి, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని, ఐటీ విభాగానికి చెందిన ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్ సహకారంతో ఆధునిక డేటాబేస్‌లు, ట్రాకింగ్ సిస్టమ్లు, నిఘా పద్ధతులను వినియోగించి నిందితుడి ఆచూకీ కనుగొన్నారు.

చివరకు, గుంటూరు జిల్లాలో నిందితుడు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో,  కోదాడ డి యస్ పి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక పోలీస్ బృందం, సీఐ చరమంద రాజు, ఎస్‌ఐ బాబు, కానిస్టేబుల్ 3139 ఎం. రామరావు, కానిస్టేబుల్ 3376 శంబయ్య గారితో కలిసి నిందితుడు బొడ్డు తిరుపతిని గుంటూరు పట్టణంలో అరెస్ట్ చేశారు.

వివరణాత్మక విచారణలో, నిందితుడు సదరు  బొడ్డు తిరుపతి, తన అసలైన గుర్తింపును పూర్తిగా మార్చుకుని, తన స్వగ్రామం మరియు కుటుంబ సభ్యుల నుండి పూర్తిగా సంబంధాలను ఆపివేసి,  జీవిస్తున్నట్లు గుర్తించారు. అతను గుంటూరులోని ఓ హోటల్లో పని చేస్తూ, స్థానికంగా ఉండే ఓ మహిళను కూడా వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఎటువంటి ఆధారాలను తన వద్ద ఉంచుకోకుండా, తన గతాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచిన విధంగా జీవిస్తూ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నించాడు.

సూర్యాపేట జిల్లా, కోదాడ డివిజన్  పోలీసులు చేసిన ప్రత్యేక కృషితో నిందితుడిని పట్టుకొన్న ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వృత్తి నైపుణ్యత, కృషి, పట్టుదల మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో ఒక ఉదాహరణగా నిలిచింది.

భగా పని చేసిన అధికారులకు ఎస్పి రివార్డ్ అందించారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >