| Daily భారత్
Logo




భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం :జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-04-24 18:46:28

Share: Share


భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం :జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "భూ భారతి 2025" నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండల్లోని స్టార్ ఫంక్షన్ హాల్ లో భూ భారతి చట్టం-2025 పై అవగాహన సదస్సు లో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి,చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్య పాల్గొని, భూభారతి చట్టంపై, అందులోని అంశాలపై వివరిస్తూ రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని దానికి భూ భారతి ముఖ్య ఉదాహరణ అని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పరిపాలనలో ధరణి ఫోటో ద్వారా రెవెన్యూ శాఖలో అనేక చిక్కులు ఏర్పడ్డాయని విమర్శించారు. అధికారులు భూ సమస్యలను పరిష్కరించడంలో ధరణి పోర్టల్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి రెవెన్యూ శాఖకు ప్రజలకు మధ్య సంబంధాలు లేకుండా చేశారని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని,. ధరణి స్థానంలో కొత్తగా  భూ భారతి వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి 2025 చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలున్నాయని తెలిపారు.  ప్రభుత్వం ఆధార్ తరహాలో భవిష్యతులో  భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో "భూధార్" తీసుకురాబోతుందని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడినదని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌కు ముందు తప్పని సరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మ్యుటేషన్ ఫీస్ క్రింద ఎకరాకు 2500 రూపాయలు ఉంటుందన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతం కావడంతోపాటు, వారసత్వ భూముల మ్యూటేషన్‌ను గడువులో పూర్తి చేయడం, హక్కుల సంక్రమణను అధికారికంగా నమోదు చేయడం ద్వారా వ్యవస్థ మరింత నిబద్ధతతో పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్ధమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు. ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణను శాస్త్రీయంగా చేస్తూనే, మోసపూరితంగా పొందిన ప్రభుత్వ భూములపై పట్టాలను రద్దు చేసే అధికారం ఈ చట్టం ద్వారా కల్పించబడిందని,భూ భారతి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందని పేర్కొన్నారు.  గ్రామాల్లో మండల వ్యవసాయాధికారుల సహకారంతో రైతు వేదికల వద్ద రెవెన్యూ సదస్సులు నిర్వహణ చేసి, ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని, భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహనను ఏర్పర్చుకోవాలని, దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.  సదస్సులో రైతులు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు..సమావేశానికి ముందు ఆర్డీఓ చంద్రకళ భూభారతి కొత్త ఆర్వోఆర్ చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చట్టం లో తీసుకొచ్చిన చట్టాల గురించి ప్రత్యేకంగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  ఆర్డీవో చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎమ్మార్వో, ఎంపీడీవో, రైతులు, రైతు సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.. చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ ముదిరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏలుగంటి ప్రతాప్ రెడ్డి, కుమ్మరి చెన్నయ్య, అశోక్, తమ్మలి రవీందర్, దండు రాహుల్ గుప్తా, అన్వర్, అక్తర్ పాషా, జంగయ్య, గంధం గౌరిశ్వర్, పొన్న వెంకట్ రెడ్డి రెడ్డి,అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >
Image 1

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Posted On 2026-03-13 17:42:24

Readmore >
Image 1

ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 17:35:18

Readmore >
Image 1

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

Posted On 2026-03-13 17:33:46

Readmore >
Image 1

కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు

Posted On 2026-03-13 16:46:49

Readmore >
Image 1

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-13 16:41:37

Readmore >
Image 1

అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్

Posted On 2026-03-13 16:39:38

Readmore >