డైలీ భారత్, హైదరాబాద్:పుష్పసినిమాలో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్,కేశవ,పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..
ఓ మహిళా జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉండగా జగదీశ్ ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జగదీశ్ మహిళా ఆర్టిస్టును బెదిరించినట్లుగా ఆరోపణ.
బెదిరింపులకు పాల్పడిన జగదీశ్ ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు.
జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఆ మహిళ జూనియర్ అర్టిస్టు గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీ సులు మహిళ ఆత్మ హత్యకు గల కారణాలను సేకరించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆర్టిస్ట్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశ్ అలియాస్ కేశవ ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్ కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.