| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లాయర్‌ దారుణ హత్య

లాయర్‌ దారుణ హత్య

డైలీ భారత్, హైదరాబాద్: చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్‌లో ఓ లాయర్‌ దారణహత్యకు గురయ్యాడు. సోమవారం ఉదయం అంబేద్కర్‌వాడలో న్యాయవాది ఇజ్రాయెల్‌ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. అడ్వకేట్‌ ఇజ్రాయెల్‌ ఇంట్లో ఓ మహిళ కిరాయికి ఉంటున్నది. ఆమెను దస్తగిరి అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ గతకొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై బాధితురాలి తరఫున ఇజ్రాయెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కక్షపెంచుకున్న దస్తగిరి.. అడ్వకేట్‌పై దాడిచేసి హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Previous హబ్సిగూడ సిగ్నల్ వద్ద డీసీఎం బీభత్సం – నాలుగురికి గాయాలు
Next ఒకటే దేశం ఒకటే ఎన్నిక
ADVERTISEMENT