డైలీ భారత్, హైదరాబాద్, హబ్సిగూడ: హబ్సిగూడ సిగ్నల్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేక్ ఫెయిల్ అయిన డీసీఎం వాహనం సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు బైకులపై వేగంగా దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌తో పాటు బైకులపై ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. బైక్‌పై ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఘటన జరిగిన సమయంలో ఒక వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, అతని బైక్ పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.