బీసీ సాధికారిత సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బీసీలకు స్థానిక సంస్థల్లో,విద్యలో ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించుటకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టిన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదము తెలిపిన శాసనసభకు జిల్లా బీసీ సాధికారిత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య, ప్రధాన కార్యదర్శి తీగల శేఖర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గుజ్జేశివరాం ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీలో నిన్న బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపడం హర్షణీయం కానీ,అట్టి బిల్లులను పార్లమెంటులో కూడ ఆమోదం పెందేలాగ కృషిచేయాలని,చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించేలాగ కృషి చేయాలని,రిజర్వేషన్ల అమలులో శాస్త్రీయ పద్ధతి పాటించాలని,భవిష్యత్తులో కోర్టు పరంగా గాని,రిజర్వేషన్ల అమలులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా, రాష్ట్ర ప్రభుత్వం తో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు కృషిచేయాలని సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం పక్షాన, సిరిసిల్లా పట్టణ బీసీ సాధికారిత సంఘం పక్షాన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య, తీగల శేఖర్ గౌడ్ లు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదంతోనే సరిపెట్టకుండా రిజర్వేషన్లు అమలుకు కృషి చేయాలని అందుకు సాధికారిత సంఘం తో పాటుగా అన్ని బీసీ కుల సంఘాలు ఐక్యంగా మీ వెంట ఉంటారని పట్టణ అధ్యక్షులు గుజ్జే శివరాం అన్నారు...
ఇట్టి సమావేశంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గుజ్జేశివరామ్ జిల్లా ఉపాధ్యక్షులు చింతకుంట వెంకటేశం, యువత జిల్లా అధ్యక్షులు అంకారపు మహేష్, మై జిల్లా మహిళా అధ్యక్షురాలు గుజ్జె తార, ఉపాధ్యక్షురాలు పత్తిపాక పద్మ, యువత పట్టణ అధ్యక్షులు అన్నారపు వేణుగోపాల్, మహిళా అధ్యక్షురాలు వంకాయల కావ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కోత్వాల్ ప్రమీల బీసీ నాయకులు గోశిక శ్రీనివాస్, జక్కని రవి, గున్నాల దేవదాస్ దాసి సతీష్, మొరశ్రీహరి, కందికట్ల సదానందం, సజ్జనం శ్యాంసుందర్, బేతి రవీందర్, కూర శ్రీధర్ చింతకుంట పద్మ, కొత్వాల్ పద్మ, ఎల్లుండి సాయి కృష్ణ, బాలసాని రాజు గౌడ్, బూర సత్యనారాయణ నాంపల్లి విష్ణు, దుబాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు