డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యతోనే విచక్షణ జ్ఞానం లభిస్తుందని, వ్యక్తి విజయానికి విద్య మూలమని, అది వజ్రాయుదం అని డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి పేర్కొన్నారు. నేడు సిరిసిల్ల పట్టణంలోని రామయ్య ఉన్నత పాఠశాలలో జరిగిన పదో తరగతి వీడ్కోలు సమావేశంలో రాధాబాయి మాట్లాడుతూ విద్యతోనే జీవితాన్ని సరియైన దిశలో మలుచుకునే సామర్థ్యం లభిస్తుందని, విద్య అనేది జ్ఞానాన్ని అందించడం లేదా సంపాదించడం పరిణితి చేకూరుతుందన్నారు. వ్యక్తిగత జీవితాన్ని కాకుండా సమాజ వికాసానికి అభివృద్ధికి దోహద పడుతుంది.
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, సమయం వృధా చేయకుండా సమీపిస్తున్న పరీక్షలకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి జీవితంలో పదవ తరగతి ఓ మైలురాయని జీవితములో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి పాఠశాల ఉపాధ్యాయులే కీలకమని అన్నారు. విద్యార్థి ఆయా ఉపాధ్యాయుల నుండి అవసరమైనంత మేరకు జ్ఞానాన్ని స్వీకరించాలని, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషిచేసి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. విద్యార్థులు కూడా మధ్యలో చదువు ఆపివేయకుండా ఉన్నత స్థాయి వరకు వెళ్లాలని కోరారు.
ఇప్పుడు కష్టపడితేనే ఎప్పటికీ సుఖపడతారని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు గౌరవ ప్రతిష్టలు పొందుతారని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని అందుకు తానే ఉదాహరణ అని సెలవిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఉమా, మాజీ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, స్టాప్ సెక్రెటరీ మల్లేశం ఉపాధ్యాయులు పాల్గొన్నారు