| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మైనర్‌ బాలికను అపహరించి వ్యభిచారం చేయించేందుకు యత్నిస్తున్న ముఠా అరెస్టు

మైనర్‌ బాలికను అపహరించి వ్యభిచారం చేయించేందుకు యత్నిస్తున్న ముఠా అరెస్టు

డైలీ భారత్, వరంగల్: నగరంలోని ఓ మైనర్‌ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన అనంతరం వ్యభిచారం  చేయించేందుకు యత్నిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు. ఇందులో ఒక మైనర్‌ బాలికతో సహా ఒక మహిళ, నలుగురు వ్యక్తులను  మిల్స్‌కాలనీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు ఒక కిలో ఎనిమిది వందల గ్రాముల గంజాయితో పాటు ఒక కారు, 75వేల రూపాయల నగదు, నాలుగు సెల్‌ ఫోన్లతో పాటు ప్రధాన నిందితురాలి ఇంటి వద్ద భారీ స్థాయిలో కండోమ్‌ ప్యాకేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలను:
1. ముస్కు లత, ల్యాదేళ్ళ గ్రామం, దామెర మండలం, వరంగల్‌ జిల్లా, 2. మైనర్‌ బాలిక, 3. వరంగల్‌ శంభుని పేటకు చెందిన అబ్దుల్‌ అఫ్నాన్‌, షేక్‌సైలాని బాబా, మహ్మద్‌ అల్తాఫ్‌, మీర్జా ఫైజ్‌ బేగ్‌ ఆలియాస్‌ వదూద్‌ లను పోలీసులు అరెస్టు చేసారు.
ఈ అరెస్టు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ వివరాలను వెల్లడిస్తూ ఈ 11వ తేదిన మైనర్‌ బాలిక కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదుపై మిల్స్‌ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి సదరు బాలికను ములుగు క్రాస్‌ రోడ్డు వద్ద గుర్తించి బాలికనకు పోలీసుల సంరక్షణలో తీసుకోని విచారించగా తనను కొంత మంది వ్యక్తులు అపహరించి, గంజాయి త్రాగించిన అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లుగా సదరు బాలిక పోలీసులకు వెల్లడించడంతో అప్రమత్తమైన పోలీసులు పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు సెంట్రల్‌ డిసిపి షేక్‌ సలీమా పర్యవేక్షణలో  వరంగల్‌ ఏసిపి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసిన నిందితులను పట్టుకొని విచారించగా ఈ వ్యవహరంలో ప్రధాన నిందితురాలైన ముస్కు లత, ల్యాదేళ్ళ గ్రామంలో వ్యభిచార వృత్తిని కొనసాగిస్తూ, తల్లిదండ్రులు మరణించడంతో మరో మైనర్‌ నిందితురాలికి తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించింది. ప్రధాన నిందితురాలు వ్యభిచార వృత్తి కొనసాగిస్తుండంతో తన వృత్తిలో అవసరమైన కొత్త మహిళలు లేదా బాలికలను తీసుకొచ్చి ఈ వ్యభిచారం నిర్వహించడం ద్వారా పెద్ద మొత్తం డబ్బు వస్తాయని దానిలో నీకు కొంత డబ్బు ఇస్తానని మైనర్‌ నిందితురాలకి తెలపడంతో, దీనికి సిద్దపడిన మైనర్‌ నిందితురాలు తన స్నేహితరాలితో పరిచయమయి బాధిత బాలికను లక్ష్యంగా చేసుకొని మైనర్‌ నిందితురాలు ఇంస్టాగ్రాం ద్వారా బాధిత బాలికతో పరిచయం పెంచుకోవడమే కాకుండా బాలిక స్కూల్‌ వెళ్ళే సమయంలో నిందితురాలు బాధిత బాలికను కలవడంత పాటు కొన్ని మైనర్‌ నిందితురాలి ప్రియుడైన నిందితుడు అబ్దుల్‌ అఫ్నాన్‌తో కలిసి బాలికను తీసుకవెళ్ళి మద్యం, గంజాయిని త్రాగటం అలవాటు చేసారు. నిందితురాలిపై మరింత నమ్మకం కలిగేందుకు బాలికకు షాపింగ్‌ మాల్స్‌కు తీసుకవెళ్ళి బట్టలను ఇప్పించడంతో వీరిపై నమ్మకం కలగడంతో సదరు బాధిత బాలిక వీరిని నమ్మి ఈ నెల 11వ తేదిన మైనర్‌ బాలికను నిందితురాలు తన ప్రియుడుతో మరో ఇద్దరు నిందితులైన షేక్‌సైలాని బాబా, మహ్మద్‌ అల్తాఫ్‌లతో కలిసి కారులో బయలుదేరి గంజాయి విక్రయాలు చేసే మీర్జా ఫైజ్‌ బేగ్‌ వద్ద గంజాయిని కొనుగోలు చేసి నర్సంపేట శివారు ప్రాంతంలో నిందితుల్లో ఒకడైన షేక్‌సైలాని బాబాకు చెందిన ఓ పురాతన ఇంటిలో బాధిత బాలికను తీసుకవెళ్ళి గంజాయి త్రాగించి షేక్‌ సైలాని బాబా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  అనంతరం బాలికను నువ్వు  రేపటి నుండి మేము చేప్పినట్లుగా వినాలి లేకుంటే నువ్వు గంజాయి త్రాగుతుండగా, అత్యాచారం చేసేది  సెల్‌ఫోన్లో చిత్రీకరించామని (వాస్తవంగా వీడియా తీయలేదు).ఈ వీడియోను బయట పెడతామని బెదిరించి సదరు మైనర్‌ బాలికను ములుగు క్రాస్‌ రోడ్డు వదిలి అక్కడి నుండి పారిపోయారని నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు.
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్‌ జోన్‌ డిసిపి షేక్‌ సలీమా, వరంగల్‌ ఏసిపి నందిరాం నాయక్‌, మీల్స్‌ కాలనీ ఇన్స్‌స్పెక్టర్‌ వెంకటరత్నం, ఎస్‌.ఐలు శ్రీకాంత్‌, సురేష్‌లతో పాటు ఇతర పోలీస్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

Previous బీసీలకు రాజకీయంగా,విద్య, ఉద్యోగ పరంగా,అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్లు ఆమోదం పట్ల హర్షం..
Next సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్
ADVERTISEMENT