Posted on 2025-02-18 15:12:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాచలం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహంలోని ప్రహరీ గోడ కూలి నెలలు కడుస్తున్న ప్రభుత్వం ప్రహరీ గోడ నిర్మించకపోవడం షెడ్యూల్ కులాల విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో తేటతెల్లమవుతుందని మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత, మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు చిట్యాల రజిత మాదిగ లు అన్నారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ పట్ల ప్రభుత్వం చవితి తల్లి ప్రేమ చూపిస్తుందని పేర్కొన్నారు. హాస్టల్ వార్డెన్ కంటే తమ భర్తల పెత్తనం ఎక్కువైందని, ప్రభుత్వం భార్యలకు ఉద్యోగాలు ఇస్తే భర్తలు మెయింటెనెన్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ నందు శుభ్రత లోపించిందని, కాలువలల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తచెదారంతో నిండి దర్శనమిస్తున్నాయని అన్నారు. బాత్రూం లు సరిపడా లేకపోవడం వలన విద్యార్థినిలు చెప్పుకోలేని విధంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని, హాస్టల్ గోడలు కూలిపోవడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయందోలనాలో విద్యార్థినీలు ఉన్నారని అన్నారు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ పట్ల సోషల్ వెల్ఫేర్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన గర్ల్స్ హాస్టల్ వార్డెన్ల భర్తల పెత్తనం ఎక్కువైందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గర్ల్స్ హాస్టల్ ప్రహరీ గోడలు తక్షణమే నిర్మించి విద్యార్థినిలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహాజన మహిళా సమైక్య మాదిగ మహిళా సమైఖ్య ల ఆధ్వర్యంలో దశలవారి పోరాటం నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, జిల్లా కార్యదర్శి కొప్పుల నాగమణి మాదిగ, గద్దల కృష్ణవేణి మాదిగ, జ్యోతి, దీవెన, తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >