| Daily భారత్
Logo




భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు 286వ జయంతి వేడుకలు...

News

Posted on 2025-02-15 21:20:40

Share: Share


భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు 286వ జయంతి వేడుకలు...

శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్  జయంతి వేడుకలలో పాల్గొన్న భద్రాచలం ఆర్ డి ఓ దామోదర్ రావు.

డైలీ భారత్, భద్రాచలం:ఎందరో మహానీయులు పుట్టిన గడ్డ మన భారతదేశం అని దాంట్లో కారణ జనుముడు, బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడు సేవలాల్ మహారాజ్ అడుగుజాడ లో నడిచి ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి గిరిజన బిడ్డ కృషి చేయాలని, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు అన్నారు.

శనివారం  భద్రాచలం పట్టణంలోని గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం భద్రాచలం ఆధ్వర్యంలో భోగ బండారో కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి భద్రాచలం బంజారా కమిటీ సభ్యులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్యక్రమాని కి వచ్చిన ఆర్డీవో మరియు ముఖ్య అతిథులకు కమిటీ సభ్యులు బంజారా సాంప్రదాయపర కారం ఘనంగా స్వాగతం పలికారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి, భోగ్ బండారో, వింతీ కార్యక్రమం బంజారా సోదరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసిన అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ జాతీ ఐక్యత కోసం అందరం పాటుపడాలని, పిలుపునిచ్చారు. లంబాడీలు దేవుడిగా భావించి  సంత సేవాలాలును కొలుస్తారని,  సేవాలాల్ జంతుబలికి తీవ్ర వ్యతిరేకి అని, తల్లి దండ్రులను మహిళలను గౌరవించాలని ప్రజలకు ఆయన బోధించారు. ప్రకృతిని వన్యప్రాణులను పరిరక్షించడం ద్వారా మానవజన్మ సార్థకత చేకూర్చుకోవాలని సూచించేవారని, ఒక సంఘ సంస్కర్త, ప్రకృతి ప్రేమికుడు ఆధ్యాత్మిక గురువు, బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పరి రక్షకుడు, జాతి ఉద్దారకుడు, భారత దేశంలో 10 కోట్ల కు పై చిలుకు జనాభా కలిగిన బంజారాలు ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతిని జరుపుకుంటున్నారని అన్నారు


చత్రపతి శివాజీ, గురునానక్ , గౌతమ బుద్ధుడి లాంటి మహనీయులు ప్రజల జీవన విధానం  కొరకు ఏ విధంగా పాటుపడ్డారో, లంబాడి బంజారా తెగల జీవన విధానం బాగుపడటానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని, అటువంటి మహనీయుల కోవకు చెందిన వాడే సంత్ సేవలల్ మహా రాజ్ అని, మన భారత దేశంలోనే కాక కర్ణాటక నుండి ఉత్తరప్రదేశ్ వరకు రాజస్థాన్ నుండి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న బంజారా జాతి జీవన విధానం కొరకు ఆయన పాటుపడ్డారని, దేశంలోని గోరు బంజారాల కు స్ఫూర్తిని నింపిన మహానుభావుడు అని, సంచార జీవితం నుండి ప్రతి బంజారా తెగలను తండ జీవితం వైపు మళ్ళించారని, మద్యం మాంసాలను మాన్పించే ప్రయత్నం చేశాడని, బంజారా తెగల అభివృద్ధికి దేశమంతటా సంచారం చేసి హితబోధ చేశాడని ఆయన అన్నారు 

అనంతరం గిరిజన సాంప్రదాయ నృత్యమైన బంజారా డాన్స్ ను, పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన నృత్యాలను వారు తిలకించి ఆనందించారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్ డి ఓ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గన్య, దుమ్ముగూడెం తహసీల్దార్ మామిది అశోక్, ఏ టీ డి ఓ అశోక్, సి.సి రామ్ నాయక్, కల్లూరి వెంకటేశ్వర్లు, భద్రాచలం బంజారా సంఘ నాయకులు బాదావత్  బ్యాన్సీ లాల్, వాంకుడో కృష్ణ నాయక్, గోవింద్, భూక్యా రంగా, భూక్యా బాల్య నాయక్, బాణోత హరీష్ చంద్ర నాయక్, బాణోత్ రాముడు, బోద వీరన్న, భూక్యా శ్వేత, భూక్యా రంజిత్, ఎల్ వెంకటేశ్వర్లు, భూక్యా వెంకటేశ్వర్లు, మలోత్ ఖీమా,  భూక్యా సాయి కౌశిక్,  దేవ, రవి,మోహన్ లాల్,తర చంద్, , నాగులు, బి.వీరన్న ,బిచ్చ, తేజవత్ బలు, సరియా, ప్రిన్సిపాల్ వీరు నాయక్, కోటేశ్, బానోత్ మధర్, బాదావత్ రాంబాబు, బానోత్ హర్జి,  భూక్యా సింధు, మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >