| Daily భారత్
Logo




ఆన్లైన్ పోర్టల్ సమాచారాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి

News

Posted on 2025-02-07 18:43:12

Share: Share


ఆన్లైన్ పోర్టల్ సమాచారాన్ని  ప్రారంభించిన  జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఆన్లైన్ పోర్టల్ సమాచారాన్ని  ప్రారంభించిన  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి.శుక్రవారం  పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టము, రంగారెడ్డి జిల్లా కార్యాలయము యొక్క కోర్టు కేసుల వివరములకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ సమాచారాన్ని  జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి , రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించినారు.ఈ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా రంగారెడ్డి పట్టణ భూ పరిమితి చట్టం కు సంబందించిన అన్ని కోర్టు వివాదాల వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. దీనివలన కోర్టు వివాదములకు చెందిన సమగ్ర సమాచారం అనగా కోర్టు కేసు వారీగా కక్షిదారుల సమాచారం, సర్వే నంబర్, గ్రామం, కేసు పూర్వాపరాలు, కేసు ప్రస్తుత స్థితి, కేసు వాయిదాల సమాచారం కలెక్టర్ కి పూర్తిగా అందుబాటులో ఉంటాయి.

దీనివలన, కలెక్టర్ కి కోర్టు కేసులు వివాదములలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు, తన క్రింది అధికారులకు తక్షణ ఆదేశాలు, సూచనలు జారీ చేయడానికి పూర్తి ఆస్కారం ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా మరుసటి రోజు వాయిదా ఉన్న కోర్టు కేసుల వివరములు కూడా అందుబాటులో ఉండి తక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎలాంటి జాప్యానికి / నిర్లక్ష్యానికి తావు లేకుండా అర్బన్ ల్యాండ్ సీలింగ్ కేసుల విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండడానికి ఈ  "ECourt-ULC RR" సహాయపడుతుంది.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >